Movie News

స్వాగ్ ఎదురీతకు కారణాలు ఏంటి

రాజరాజ చోర సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వచ్చిన స్వాగ్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం కనిపిస్తోంది. ప్రీమియర్లు, మొదటి రోజు మార్నింగ్ షో చూసిన యూత్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ కనిపించినప్పటికీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవనేది ట్రేడ్ టాక్. వీకెండ్ మొత్తం కలిపి ఏడున్నర కోట్ల దాకా గ్రాస్ వచ్చిందనే వార్త పాజిటివ్ సైన్ కాదు. నిన్న మొదటి ఆదివారం బుక్ మై షోలో పాతిక వేల లోపే టికెట్లు అమ్ముడుపోవడం మరో ప్రమాద సంకేతం. ఒకవేళ హిట్ టాక్ వచ్చి ఉంటే ఈ నెంబర్ కనీసం నలభై వేలు దాటి ఉండాలనేది ఇటీవలి హిట్ సినిమాల ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

అసలు స్వాగ్ ఎదురీతకు కారణాలు ఏంటనేది ఓసారి లుక్ వేద్దాం. ట్రాన్స్ జెండర్ కాన్సెప్ట్ ని సందేశాత్మకంగా చెబుతూనే వినోదాన్ని జొప్పించాలనే దర్శకుడు హసిత్ గోలి ప్రయత్నం ఒక వర్గం యూత్ కి కనెక్ట్ అయ్యింది కానీ సాధారణ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ కు గురి చేసింది. నిజానికి వాళ్ళు ఆశించింది ఫుల్ ఎంటర్ టైన్మెంట్. రెండున్నర గంటలు నవ్వుతూ బయటికి రావాలని. కానీ అది పూర్తి స్థాయిలో నెరవేరలేదు. శ్రీవిష్ణు తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో నాలుగు పాత్రలను అవలీలగా పోషించినా స్క్రీన్ ప్లేలో ఉన్న సంక్లిష్టత వల్ల సామాన్య జనం నుంచి కోరుకున్న టాక్ బయటికి రాలేదు.

నిస్సందేహంగా స్వాగ్ ఆహ్వానించదగ్గ కంటెంటే కాని తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు కొంత మెరుగ్గా వర్క్ చేసి ఉంటే రాజరాజ చోరని మించేదని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించినప్పటికీ వైరలయ్యే స్థాయిలో పాటలు లేకపోవడం మరో మైనస్ గా నిలిచింది. స్వాగణిక వంశానికి ట్రాన్స్ జెండర్ సమస్యకు ముడిపెట్టే ఆలోచన బాగానే ఉన్నా అన్ని వర్గాలను మెప్పించడంలో తడబడింది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ కాస్త ఎక్కువే ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్. పది రోజుల క్రితం వచ్చిన దేవరనే స్వాగ్ కన్నా దూకుడుగా ఉండటం శ్రీవిష్ణుకి మాస్ మద్దతు మిస్సయిన వైనాన్ని స్పష్టం చేసింది.

This post was last modified on October 7, 2024 6:00 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago