Movie News

వీరయ్య నాయుడు స్ఫూర్తితో వైజాగ్ వాసు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ మధ్య విభిన్నంగా ఏదైనా చేద్దామని ఒప్పుకున్న సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడం ఏ స్థాయిలో ఉందంటే కనీసం అవొచ్చిన సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులకు తెలియనంత. దీని వల్ల వరుణ్ మార్కెట్ కి డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. అందుకే మట్కా నిర్మాణంలో ఉండగా ఏవేవో ప్రచారాలు, పుకార్లు చక్కర్లు కొట్టాయి. వీటికి తోడు గత రెండు సినిమాలు ఫెయిల్యూర్స్ అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ దీనికి డైరెక్టర్ కావడంతో వాటికి మరింత బలం చేకూరింది.

వీటికి చెక్ పెడుతూ నిన్న వచ్చిన మట్కా ట్రైలర్ అభిమానుల్లోనే కాదు ఆడియన్స్ లోనూ ఆసక్తి పెంచింది. 60 నుంచి 90 దశకం మధ్యలో సౌత్ ఇండియాని ఊపేసిన ఒక రియల్ లైఫ్ మట్కా డాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నవంబర్ 14 విడుదల కానుంది. యువకుడి నుంచి ముసలి వయసు దాకా వరుణ్ తేజ్ ని రకరకాల షేడ్స్ లో చూపించబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మట్కా కోసం కరుణ కుమార్ కల్ట్ క్లాసిక్ నాయకుడు ఫార్ములాని వాడుకున్నాడు. అందులో వీరయ్య నాయుడు తరహాలో మట్కాలో వైజాగ్ వాసు ప్రయాణం చూపించబోతున్నారు.

ఫైనల్ గా వరుణ్ తేజ్ సరైన దారిలో పడ్డాడని చెప్పాలి. ప్యాన్ ఇండియాలో చేస్తున్నారు కాబట్టి కంటెంట్ కనక కనెక్ట్ అయితే సూపర్ హిట్ పడ్డట్టే. కాకపోతే దుల్కర్ సల్మాన్ కింగ్ అఫ్ కోతలో జరిగిన పొరపాట్లు మట్కాలో రిపీట్ కాకుంటే చాలు. ఈ సినిమా కోసం మెగా ప్రిన్స్ చాలా కష్టపడ్డాడు. లవ్, రొమాంటిక్ జానర్ నుంచి షిఫ్ట్ అయిపోయి మాస్, కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న వరుణ్ తేజ్ కి మట్కా సక్సెస్ కావడం చాలా కీలకం. దానికి తగ్గట్టే భారీ బడ్జెట్, పెద్ద టెక్నికల్ టీమ్, కోట్ల రూపాయల సెట్లు, జివి ప్రకాష్ సంగీతం అన్ని సమకూరాయి. ఇంకో నలభై రోజుల్లోపే థియేటర్లకు వచ్చేస్తోంది.

This post was last modified on October 6, 2024 3:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago