రాజకీయ రంగ ప్రవేశానికి ముందు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న తన 69వ ప్రాజెక్టుకు సంబంధించిన లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
పొలిటికల్ ఎంట్రీ టైంలో రెగ్యులర్ కమర్షియల్ మూవీ చేస్తే విమర్శలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏదైనా సందేశం ఉండేది ఎంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు హెచ్ వినోత్ ని ఆ కోణంలో చూడమని చెప్పినట్టు చెన్నై టాక్.
అందులో భాగంగా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరిని కీలక మార్పులతో కోలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి అనుగుణంగా తీర్చిదిద్దారని వినిపిస్తోంది. పాయింట్ ఒకటే అయినప్పటికీ పోలిక రాని విధంగా ట్రీట్ మెంట్ ఉంటుందని వినికిడి.
ఇదంతా ప్రస్తుతానికి పుకారే కానీ బలమిచ్చేలా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఒక కీలక పాత్రకు సూపర్ హిట్ ప్రేమలు ఫేమ్ మమిత బైజు ఎంపిక. ఇంత టీనేజ్ అమ్మాయిని విజయ్ కి జోడిగా తీసుకునే సాహసం చేయరు. సో శ్రీలీల క్యారెక్టర్ అయితే ఆశ్చర్యపోనక్కర్లేదు.
కాజల్ అగర్వాల్ స్థానంలో పూజా హెగ్డే వచ్చిందట. మెయిన్ విలన్ మన దగ్గర జాన్ అబ్రహం అయితే తమిళంలో బాబీ డియోల్ ని లాక్ చేశారు. సో చాలా విషయాల్లో భగవంత్ కేసరితో విజయ్ 69 క్యాస్టింగ్ మ్యాచ్ అవుతోంది. ఎంత మేరకు నిజమో తేలాలంటే కనీసం టీజర్ రావాల్సిందే. అప్పటిదాకా వెయిట్ చేయాలి.
గతంలో భగవంత్ కేసరి టైంలో విజయ్ ప్రత్యేకంగా సినిమాను మెచ్చుకుంటూ బాలయ్య, అనిల్ రావిపూడి ఇద్దరితో మాట్లాడారని టాక్ ఉంది. నిర్ధారణ చేసేందుకు వీడియోలు ఏం రాలేదు.
ఒకవేళ ఈ వార్త కన్ఫర్మ్ అయితే విజయ్ సెలక్షన్ రైటని చెప్పొచ్చు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తమిళనాడులో భారీ వసూళ్లు సాధించినప్పటికీ ఇతర భాషల్లో డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఏదో ఇమేజ్ వల్ల డబ్బులొచ్చినా కంటెంట్ వాళ్లకూ నచ్చలేదన్నది వాస్తవం. సో భగవంత్ కేసరిని ఎంచుకుంటే మాత్రం మంచి ఛాయస్ అవుతుంది. ఈ గాసిప్ విజయ్, బాలయ్య ఇద్దరి ఫ్యాన్స్ కి కిక్కిచ్చేదే.
This post was last modified on October 2, 2024 2:53 pm
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……