Movie News

‘ఆగడు’ విషయంలో తప్పెక్కడ జరిగింది?

మహేష్ బాబు కెరీర్లో భారీ అంచనాల మధ్య విడుదలైన దారుణమైన ఫలితాన్ని అందుకున్న చిత్రాల్లో ‘ఆగడు’ ఒకటి. ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్లతో మహేష్ బాబు చేసిన సినిమా కావడంతో దీనికి మామూలు హైప్ రాలేదు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

మహేష్‌కు ‘దూకుడు’ లాంటి మెమొరబుల్ మూవీ ఇచ్చిన ఇచ్చిన దర్శకుడే ‘ఆగడు’ లాంటి మరిచిపోదగ్గ సినిమాను ఇవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ సినిమా దగ్గర్నుంచే శ్రీను వైట్ల కెరీర్ కూడా తిరగబడింది.

‘ఆగడు’ సినిమా చేయడం మిస్టేక్ అని మహేష్ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఐతే ఇప్పుడు వైట్ల కూడా ఆ సినిమా విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన కొత్త చిత్రం ‘విశ్వం’ దసరా కానుకగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ‘ఆగడు’ను అతి పెద్ద ‘రిగ్రెట్’గా భావిస్తానని వైట్ల చెప్పాడు.

‘ఆగడు’కు సంబంధించి ప్రతి నిర్ణయం తాను తీసుకుందే అని.. అందుకే ఈ సినిమా విషయం లో తాను చాలా పశ్చాత్తాపం చెందుతానని వైట్ల తెలిపాడు. నిజానికి ఆ టైంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న కథ వేరని.. కానీ దాన్ని పక్కన పెట్టి ‘ఆగడు’ చేశామని వైట్ల వెల్డడించాడు.

ఇందుకు కారణాలను కూడా ఆయన వివరించాడు. ‘‘మహేష్ బాబుతో దూకుడు తర్వాత మళ్లీ చేసే సినిమా అంటే చాలా పెద్ద స్థాయిలో ఉండాలనుకున్నాను. అందుకే ఓ పెద్ద స్పాన్ ఉన్న కథను తయారు చేశాను. అది మహేష్‌కు వినిపిస్తే చాలా ఎగ్జైట్ అయ్యాడు.

ఐతే ఆ సమయానికి ‘ఆగడు’ నిర్మాతలైన నా స్నేహితుల పరిస్థితి అంత బాగా లేదు. వాళ్లు ఆ సినిమాకు అంత భారీ ఖర్చు పెట్టే స్థితిలో లేరు. దీంతో నేనే అంత పెద్ద కథ వద్దనుకుని విలేజ్ సెటప్‌లో తక్కువ బడ్జెట్లో అయ్యే సినిమా చేద్దామనుకుని ‘ఆగడు’ ట్రై చేశాం.

కానీ అది తేడా కొట్టింది. ప్రొడక్షన్, బడ్జెట్ గురించి ఆలోచించకుండా ముందు అనుకున్న కథే చేయాల్సిందనిపించింది. ఇది నేను ‘ఆగడు’ నుంచి నేర్చుకున్న పాఠం. ఐతే మహేష్‌తో అప్పుడు తీద్దామనుకుని పక్కన పెట్టిన కథ ఇప్పుడు చేయడం కుదరదు. అది అప్పుడే చేసి ఉండాల్సిన కథ’’ అని వైట్ల తెలిపాడు.

This post was last modified on October 2, 2024 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీతో జగన్ ది అక్రమ బంధం: వైఎస్ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…

1 hour ago

నిన్న దావూది ఇవాళ హైరానా….అదే సమస్య

ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…

1 hour ago

బీరు కరువు తప్పేలా లేదు

తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…

3 hours ago

సమీక్ష – గేమ్ ఛేంజర్

2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…

3 hours ago

అరస్ట్.. కేటీఆర్ అనుకున్నట్టు జరగలేదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…

4 hours ago

చంద్రబాబు, జగన్… విదేశాలకు ఇద్దరూ ఒకేసారి

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……

10 hours ago