Movie News

వనిత విజయ్ కుమార్… నాలుగో పెళ్లి

వనిత విజయ్ కుమార్.. ఈ నటి చేసిన సినిమాల కంటే.. ఆమె చుట్టూ నడిచిన వివాదాలే ఎక్కువ. దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయురాలైన వనిత.. ‘దేవి’ సహా కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది.

అప్పుడు ఆమె పెద్దగా వార్తల్లో ఉండేది కాదు కానీ.. తల్లి మరణానంతరం తండ్రితో ఆస్తి గొడవలు.. అలాగే వ్యక్తిగత జీవితంలో వివాదాలతో తన పేరు మీడియాలో తరచుగా నానుతూనే ఉంది. తన వైవాహిక జీవితం ఎప్పుడూ వివాదాల మయమే.

ఆమెకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లి జరగడం గమనార్హం. ఇప్పుడు ఆమె నాలుగో పెళ్లి గురించి సమాచారం బయటికి వచ్చింది. అక్టోబరు 5న రాబర్ట్ అనే వ్యక్తితో తన పెళ్లి జరగబోతున్నట్లు వనిత స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కొరియోగ్రాఫర్ అయిన రాబర్ట్‌తో ఆమె కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది.

2000లో నటుడు ఆకాశ్‌ని పెళ్లి చేసుకోగా వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి పుట్టారు. ఐతే తర్వాత మనస్ఫర్తలు వచ్చి 2005లో ఈ జంట విడాకులు తీసుకు:ది. 2007లో ఆనంద్‌ జయదర్శన్‌ అనే వ్యాపారవేత్తను వనిత రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు పుట్టింది.

ఐదేళ్ల కాపురం తర్వాత 2012లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆపై కొరియోగ్రాఫర్‌ రాబర్ట్‌తో కొన్నాళ్లపాటు వనిత సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. కానీ 2020లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫొటోగ్రాఫర్‌ పీటర్‌ పాల్‌ను వనిత మూడో పెళ్లి చేసుకుంది. కానీ నాలుగు నెలలకే వీరి మధ్య తీవ్రమైన గొడవలు వచ్చాయి. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మీడియాకెక్కారు.

ఐతే పీటర్‌తో తనకు పెళ్లే జరగలేదని వనిత ఆ సందర్భంలో చెప్పి అందరికీ షాకిచ్చింది. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తుండగా ఇలా మాట్లాడడం వనితకే చెల్లింది. కాగా వనిత నుంచి విడిపోయాక అనారోగ్యంతో పీటర్ చనిపోయాడు. కొన్నాళ్ల పాటు మీడియా కంట్లో పడని వనిత.. ఇప్పుడు రాబర్ట్‌తో తన పెళ్లి వార్తతో మళ్లీ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.

This post was last modified on October 2, 2024 10:49 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

8 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago