టాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ తేజ్‌కు కొన్నేళ్ల నుంచి అస్సలు కలిసి రావడం లేదు. అతను లీడ్ రోల్ చేసిన చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాయి. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్.. ఇలా గత రెండేళ్లలో మూడు వైవిధ్యమైన సినిమాలతో అతను ప్రేక్షకులను పలకరించాడు. కానీ ప్రతిసారీ తిరస్కారమే ఎదురైంది. దీంతో తన ఆశలన్నీ కొత్త చిత్రం ‘మట్కా’ మీదే ఉన్నాయి.
‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ‘హాయ్ నాన్న’ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్.. ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తాజాగా రిలీజ్ డేట్ ఖరారు చేశారు. నవంబరు 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ డేట్ చాలా రిస్కీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుక్కారణం.. కంగువ.
సూర్య ప్రధాన పాత్ర పోషించిన ‘కంగువ’ను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. దీంతో మరో సోలో డేట్ కోసం చూసిన టీం నవంబరు 14కు ఫిక్స్ అయింది.
మామూలుగా నవంబరు నెల పెద్ద సినిమాలకు పెద్దగా కలిసి రాదు. కానీ ‘కంగువ’కు మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆ డేట్‌తో ఇబ్బంది లేదనుకున్నారు. ‘కంగువ’ పట్ల తమిళం అనే కాక ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఆ మూవీ ఇప్పటికే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. అలాంటి సినిమాకు పోటీగా వరుణ్ మూవీని రిలీజ్ చేయడం ఎంత వరకు శ్రేయస్కరం అనే ప్రశ్న తలెత్తుతోంది. అసలే వరుణ్ ఫ్లాపుల మీద ఉన్నాడు. కరుణ్ కుమార్ మంచి అభిరుచి ఉన్న దర్శకుడే కానీ.. ఇప్పటిదాకా కమర్షియల్ సక్సెస్ లేదు. ‘మట్కా’ బడ్జెట్ ఏమో వరుణ్ మార్కెట్‌కు మించి పెట్టేశారు. పైగా దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాంటపుడు పెద్దగా కలిసి రాని సీజన్లో.. సూర్య క్రేజీ మూవీకి పోటీగా విడుదల చేయాలనుకోవడం రిస్క్ కాక మరేంటి?
This post was last modified on October 1, 2024 1:21 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…