ఆ మధ్య కల్కి 2898 ఏడి గురించి మాట్లాడుతూ బాలీవుడ్ సీనియర్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్లు ఎంత దుమారం రేపాయో అందరికీ గుర్తే. ప్రభాస్ ని జోకర్ తో పోలుస్తూ ఇచ్చిన నిర్వచనం అన్ని వర్గాల ఆగ్రహానికి కారణమయ్యింది. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా ముంబైలో ఉండే నటీనటుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. అయినా సరే అర్షద్ ని దీని గురించి అడుగుదామంటే మీడియాకు దొరక్కుండా మేనేజ్ చేసుకున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో జర్నలిస్టుల నుంచి ఆ ప్రశ్నను తప్పించుకోలేక వివరణ ఇచ్చాడు.
తాను అన్నది హీరోని కాదని, పాత్ర గురించి మాత్రమే విమర్శ చేశానని, ఒక యాక్టర్ గా ఎప్పుడో ఋజువు చేసుకుని గొప్ప సినిమాలు చేస్తున్న ప్రభాస్ గురించి తాను అన్న మాటలను వివాదం కోరుకునే కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చాడు. బ్రిలియంట్ యాక్టర్ గా ప్రతి సినిమాకు ఇంకో స్థాయికి వెళ్తున్న ప్రభాస్ మీద నోరెందుకు పారేసుకుంటానని అన్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ముచ్చటేదో కాంట్రావర్సి వచ్చినప్పుడే కనీసం ఒక వీడియో రూపంలోనే లేదా ట్వీట్ ద్వారానో చెప్పి ఉంటే సరిపోయేది. ఇన్ని వారాలు నానబెట్టి ఇప్పుడు తీరిగ్గా నేనన్నది తూచ్ అంటే ఎలా అనేది ఫ్యాన్స్ వెర్షన్.
ఏదైతేనేం మొత్తానికి అర్షద్ వార్సి ఈ వ్యవహారానికి చెక్ పెట్టేశాడు. అయినా ప్రభాస్ మీద ఇలాంటి శోకాలు, కామెంట్లు కొత్త కాదు, ఇప్పట్లో ఆగేవి కాదు. బాహుబలి నుంచి ఇది జరుగుతూనే ఉంది. కేవలం డబ్బింగ్ వెర్షన్లతో హిందీలో ఆల్ టైం రికార్డులు సృష్టించడం చూసి అక్కడి చాలా మంది ఖాన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి మాటల రూపంలో బాణాలు వదులుతూ తిరిగి బూమరాంగ్ కావడం అలవాటైపోయింది. ఇంత చేసిన అర్షద్ వార్సీ రేపు ఎప్పుడైనా ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే వద్దంటాడా. చిన్నదో పెద్దదో క్యారెక్టర్ ఏదైనా యెగిరి గంతేసి చేస్తాడు. డార్లింగ్ రేంజ్ అలాంటిది.
This post was last modified on September 29, 2024 1:09 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…