Movie News

స్త్రీ-2.. ఇప్పటికీ బ్యాటింగే

బాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూశాం. ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఐతే బ్లాక్‌బస్టర్లు, రికార్డులు అనగానే అక్కడ ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర కథానాయకులే గుర్తుకు వస్తారు. కొన్ని దశాబ్దాల నుంచి ఆల్ టైం రికార్డులన్నీ వీరిలో ఒకరి నుంచి ఒకరికి మారుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ హిందీ సినిమా కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసి పెను సంచలనం సృష్టించింది. అదే.. స్త్రీ 2.

2018లో వచ్చిన హార్రర్ కామెడీ మూవీ ‘స్త్రీ’కి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ఇది. అందులో నటించిన శ్రద్ధా కపూర్ మరోసారి లీడ్ రోల్ చేసింది. రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్ర పోషించాడు. ఆగస్టు 15న మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం.. ఆ అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. తొలి రోజు రూ.60 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేయడం మొదలు.. సంచలనాల మోత మోగించింది.

మూడు వారాల వ్యవధిలో ఈ సినిమా రూ.550 కోట్ల వసూళ్లు సాధించి.. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా రికార్డులకెక్కింది. ఓవరాల్ రికార్డు ‘దంగల్’ పేరిట ఉన్నప్పటికీ.. ఇండియాలో అత్యధిక వసూళ్ల రికార్డు మాత్రం గత ఏడాది వచ్చిన ‘జవాన్’ పేరిట ఉంది. దాన్ని దాటేసి ఇప్పటిదాకా ‘స్త్రీ-2’ రూ.590 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. విశేషం ఏంటంటే.. రిలీజై నెల రోజులు దాటినా ‘స్త్రీ-2’ థియేట్రికల్ రన్ ముగియలేదు.

ఉత్తరాదిన ప్రధాన మల్టీప్లెక్సులన్నీ ఈ సినిమాకు ఇంకా చెప్పుకోదగ్గ షోలు ఇస్తూనే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా ఈ సినిమా ఆడుతోంది. గత కొన్ని వారాల నుంచి సరైన కొత్త సినిమాలు రావట్లేదు. దీంతో ప్రేక్షకులు ఇంకా ‘స్త్రీ-2’ కోసం థియేటర్లకు వెళ్తున్నారు. వచ్చే నెల మధ్యలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. అప్పటిదాకా థియేటర్లలో ‘స్త్రీ-2’ బ్యాటింగ్ కొనసాగుతూనే ఉంటుందన్నమాట.

This post was last modified on September 22, 2024 5:10 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

1 hour ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

1 hour ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

5 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

5 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

8 hours ago