నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మాంచి ఊపుమీదున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన అతను.. ఇటీవలే కొంచెం గ్యాప్‌లో రెండు సినిమాలు మొదలుపెట్టాడు. అందులో ఒకటి హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న హిట్-3 కాగా.. ఇంకోటి దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నది.
హిట్ ఫ్రాంఛైజీ సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ముందే ఒక అంచనా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమాలు సాగుతాయి. నాని హీరోగా వచ్చాడు కాబట్టి కొంచెం హీరోయిజం, మాస్ కూడా జోడిస్తున్నట్లున్నాడు శైలేష్. ఇక శ్రీకాంత్ ఓదెల సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దసరాతో ఈ సుకుమార్ శిష్యుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో మాస్, థ్రిల్స్ జోడించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఈసారి అతనెలాంటి కథతో వస్తాడు అన్నది ఆసక్తికరం.
ఈసారి కూడా శ్రీకాంత్ ఓదెల ఒక రా మాస్ చూపించబోతున్నాడన్నది చిత్ర వర్గాల సమాచారం. రాయలసీమ ప్రాంతంలో ఒక అరుదైన తెగకు సంబంధించిన నేపథ్యాన్ని శ్రీకాంత్ ఎంచుకున్నాడట. దాని చుట్టూ ఓ థ్రిల్లర్ కథను అల్లాడట. ఆ తెగకు సంబంధించిన వ్యవహారమే సెన్సేషనల్‌గా ఉంటుందని.. వాస్తవ అంశాలకు కల్పన జోడించి సంచలనాత్మకంగా కథను అల్లాడట శ్రీకాంత్.
దసరాలో నాని లుక్, తన పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆశ్చర్యపరిచాయో తెలిసిందే. ఈసారి ఇంకా వయొలెంట్‌గా, మాస్‌గా తన లుక్ ఉంటుందని సమాచారం. కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ చేస్తారని.. అప్పుడే ప్రేక్షకులు సర్ప్రైజ్ కావడం ఖాయమని.. దసరాను మించి మ్యాడ్‌నెస్ ఉంటుందని నాని చెప్పడానికి ఈ సినిమా కథాంశం ఇచ్చిన కాన్ఫిడెన్సే కారణమని అంటున్నారు. దసరా రిలీజయ్యాక దాదాపు ఏడాదిన్నర పాటు విరామం తీసుకుని ఈ సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా నిర్మాణం జరుపుకోనున్నట్లు తెలిసింది.
This post was last modified on September 21, 2024 6:03 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…