నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి ఊపు మీదున్నాడు. 15 నెలల వ్యవధిలో అతను మూడు సక్సెస్‌లు అందుకున్నాడు. గత ఏడాది వేసవిలో నాని మూవీ ‘దసరా’ మంచి విజయాన్నందుకుంది. ఇలాంటి మాస్ హిట్ తర్వాత ఆ ఏడాది చివర్లో ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతో హిట్ కొట్టాడు. ఇక ఇటీవలే ‘సరిపోదా శనివారం’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. వర్షాల వల్ల అక్కడక్కడా స్వల్ప నష్టాలు వచ్చాయి కానీ.. ఓవరాల్‌గా ఈ మూవీ పెట్టుబడిని వెనక్కి తెచ్చి సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.
ఈ ఉత్సాహంలో నేచురల్ స్టార్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇంతకముందే ఖరారైన ‘హిట్-3’ చిత్రాన్ని లైన్లోకి తీసుకొచ్చాడు. ‘హిట్’ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన శైలేష్ కొలన దర్శకత్వంలో ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ మొదలైంది.
ఐతే ‘సరిపోదా శనివారం’ తర్వాత నాని.. శ్రీకాంత్ ఓదెల సినిమా చేస్తాడని ముందు అనుకున్నారు. ఆ సినిమానే ముందు అనౌన్స్ చేశారు కూడా. ఐతే స్క్రిప్టు రెడీ కావడంలో బాగా ఆలస్యం జరగడం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ‘హిట్-3’ ముందుకు వచ్చేసింది. దీంతో ‘దసరా’ కాంబో రిపీటవుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.
ఐతే తాజాగా నాని.. శ్రీకాంత్ సినిమా గురించి కూడా అప్‌డేట్ ఇచ్చేశాడు. ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లిన విషయాన్ని ధ్రువీకరించాడు. ‘దసరా’తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని నాని చెప్పడం విశేషం. నాని ఒకేసారి హిట్-3, శ్రీకాంత్ సినిమాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. మరి రెండు చిత్రాల మధ్య లుక్స్ పరంగా ఎలా వైవిధ్యం చూపిస్తాడో చూడాలి. ఇలా నిలకడగా హిట్లు ఇస్తూ.. వేగంగా సినిమాలు చేయగలగడం నానికే చెల్లు అని ఇండస్ట్రీలో అందరూ అతణ్ని ప్రశంసిస్తున్నారు.
This post was last modified on September 19, 2024 4:11 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…