Trends

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ అమ్మాయి కొన్ని రోజుల్లోనే సెలబ్రెటీ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీ సినిమా అవకాశాలు సైతం అందుకుంది. మోడల్‌గానూ మారింది. అలాంటి అమ్మాయి సడెన్‌గా ఇప్పుడు కేరళకు వచ్చి ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది.

ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయి కోసం కేరళకు వచ్చి.. తమ పెళ్లికి సహకరించాలని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. ఇలా కోరిన కొన్ని గంటలకే ఆమె ఫర్మాన్‌ను పెళ్లి కూడా చేసుకుంది. ఐతే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం ముస్లిం అబ్బాయిలకు అలవాటే అని.. ఇది లవ్ జిహాద్ అని కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణలపై మోనాలిసా, ఫర్మాన్ జంట స్పందించింది. పెళ్లి అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఈ జోడీ.. లవ్ జిహాద్ ఆరోపణలను తిప్పి కొట్టింది.
ఈ వివాదంపై ఫుర్మాన్ ఖాన్ స్పందించారు.

ఇది లవ్ జీహాద్ కాదని.. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ అని.. తామిద్దరం ఎవరి మతాలను వారు అనుసరిస్తామని.. అన్ని మతాలను గౌరవిస్తామని.. అన్నిటికంటే ముందు తామిద్దరం మనుషులం అని ఫర్మాన్ స్పష్టం చేశాడు. మరోవైపు మోనాలిసా మాట్లాడుతూ.. తనకు హిదూ ధర్మం మీద ఉన్న గౌరవం ఎప్పటికీ కొనసాగుతుందని.. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని, దీనికి మతం రంగు పులమవద్దని కోరింది.

మోనాలిసా, ఫర్మాన్ ఇంత స్పష్టంగా విషయం చెప్పినా.. సోషల్ మీడియాలో మాత్రం వారిపై ఎటాక్ ఆగట్లేదు. మరోవైపు మోనాలిసాకు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కుంభమేళాలో మోనాలిసా చూపిన ధైర్యం, తన వ్యక్తిత్వం చూసి తాను ప్రభావితమయ్యానని, సనాతన ధర్మానికి ఆమె ఒక ప్రతినిధిగా నిలుస్తుందని భావించి సినిమాలో అవకాశం ఇచ్చానని.. పెళ్లి విషయంలో ఆమె నిర్ణయం తనను విస్మయానికి గురిచేసిందని ఆయనన్నారు.

This post was last modified on March 13, 2026 2:23 am

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

7 hours ago