`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌కు బీజేపీ కీలక పదవిని అప్పగించింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు.. పార్టీ అధికార ప్రతినిధులు సహా రాష్ట్రస్థాయి కన్వీనర్లు, మీడియా చర్చల్లో పాల్గొనే వారికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. దీనిలో చీకోటి ప్రవీణ్‌కు అవకాశం కల్పించడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
భాగ్యనగర్, మలక్‌పేట ప్రాంతాల అధికార ప్రతినిధిగా .. చీకోటి ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు. దీంతో ఆయన ఆయా ప్రాంతాలకు చెందిన బీజేపీ వ్యవహారాలకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. పార్టీ తరఫున కార్యక్రమాల నుంచి మీడియా బ్రీఫింగుల వరకు.. చీకోటి కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాదు.. పార్టీ తరఫున కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా ఆయన ముఖ్య భూమిక పోషించనున్నారు. ప్రస్తుతం పలువురు పదవుల కోసం వేచి చూస్తున్న క్రమంలో ఈ నియామకాలు చేపట్టడం గమనార్హం.
అనేక కేసులు..
చీకోటి ప్రవీణ్.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానీ కి అత్యంత సహచరుడు. అంతేకాదు.. 2021-23 మధ్య కాలంలో గుడివాడ కేంద్రంగా కేసినో నిర్వహించి.. కోట్ల రూపాయలను దండుకున్నారని టీడీపీ నాయకులు అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు. చివరకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ సహా.. పలు దేశాల క్యాసినో నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా చీకోటి అప్పట్లోనే అంగీకరించారు.
ఆనాడు వైసీపీ హయాంలో సంక్రాంతి, దసరాలకు క్యాసినో నిర్వహించారు. దీనిలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజునే 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. అశ్లీల నృత్యాలు, పేకాటలు, మందు.. మాదకద్రవ్యాలను కూడా సరఫరా చేశారన్న కేసులు నమోదయ్యాయి. దీంతో స్విట్జర్లాండుకు పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ శివారులో అతి పెద్ద ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని.. నెమళ్లు, క్రూరమృగాలు, కొండచిలువలను పెంచడం చీకోటి హాబీ. అలాంటి వ్యక్తి బీజేపీలో ఎప్పుడు చేరాడో తెలియదు కానీ.. ఇప్పుడు పదవులు ఇవ్వడంతో మరో సారి చర్చనీయాంశం అయ్యాడు.
This post was last modified on March 13, 2026 11:52 am
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…