Movie News

టాలీవుడ్ దసరా పోటీలో అదొక్కటే లోటు

సెప్టెంబర్ 27 దేవర విడుదలయ్యాక అందరి చూపు దసరా వైపు వెళ్తుంది. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే హాలిడే సీజన్ కావడంతో వీలైనంత రాబట్టుకునే అవకాశం నిర్మాతలకు దొరుకుతుంది. గత కొన్నేళ్లుగా పెద్ద హీరోలు క్రమం తప్పకుండా ఈ పండగ బరిలో దిగుతున్నారు కానీ ఈసారి మాత్రం ఎవరూ లేకపోవడం కొంత నిరాశ కలిగించే విషయమే. రజనీకాంత్ ‘వెట్టయన్’ తమిళ డబ్బింగ్ కాబట్టి దాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోలేం కానీ టాక్ కనక బాగా వస్తే వస్తే జైలర్ లాగా దుమ్ము దూలపొచ్చు లేదా లాల్ సలామ్ లాగా చేతులు జేబులో పెట్టుకుని ఎటో వెళ్లిపోవచ్చు.

దీని సంగతలా ఉంచితే బరిలో ఉన్న మిగిలిన నాలుగు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల హీరోలు ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన ఒత్తిడితో వస్తున్న వాళ్లే. గోపీచంద్ ‘విశ్వం’ ఒకప్పటి శీను వైట్ల వింటేజ్ ని బయటికి తెస్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అదే జరిగితే ఫ్యాన్స్ హమ్మయ్యాని ఊపిరిపీల్చుకుంటారు. సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ మీద క్రమంగా బజ్ పెరుగుతోంది. టీజర్ చూశాక సానుకూలత కనిపించింది. హరోంహర అంచనాలు అందుకోలేకపోయిన నేపథ్యంలో దీని సక్సెస్ కీలకం కానుంది. సుహాస్ ‘జనక అయితే గనక’ మీద నమ్మకంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కొనేసుకున్నాడు.

దిల్ రాజు ప్రొడక్షన్ కాబట్టి రిలీజ్ గట్రా వ్యవహారాలు గట్టిగా ఉంటాయి. వీటికన్నా ముందు వన్ వీక్ అడ్వాంటేజ్ ముందుగా తీసుకునే ఉద్దేశంతో శ్రీవిష్ణు ‘స్వాగ్’ సోలోగా వస్తోంది. దేవర రిలీజైన ఏడు రోజులకే రిస్క్ అయినా సరే కంటెంట్ మీద నమ్మకంతో దూకేస్తున్నాడు. దీంతో పాటు విశ్వం కూడా ఒకే ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఇలా నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఎలా ఉన్న సీనియర్, జూనియర్ టయర్ 1 స్టార్ హీరోల సినిమాలు ఏ ఒక్కటి లేకపోవడం దసరా వరకు ఖచ్చితంగా లోటే. ఇక్కడ చెప్పినవి ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా వాటి రేంజ్ పరిమితం. వందల కోట్లు లాగలేవు. స్టామినా ఉన్న హీరోలు ఉంటే ఆ కళే వేరు.

This post was last modified on September 18, 2024 11:11 am

Share
Show comments

Recent Posts

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

3 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

3 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

4 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

6 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

6 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

7 hours ago