బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘రైడ్’ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి కొన్నేళ్ల ముందే ప్రయత్నాలు జరిగాయి. మొదట అక్కినేని నాగార్జున హీరోగా ఈ సినిమా తీయాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. ఐతే గత ఏడాది రవితేజ హీరోగా ఈ రీమేక్ ఖరారైంది. ‘దబంగ్’ను ‘గబ్బర్ సింగ్’గా.. ‘జిగర్ తండ’ను ‘గద్దలకొండ గణేష్’గా చాలా బాగా రీమేక్ చేశాడని పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్‌కు ఈ రీమేక్ బాధ్యతలు అప్పగించడంతో ఇది కూడా వాటి బాటలోనే మంచి ఫలితాన్ని అందుకుంటుందని ఆశించారు ప్రేక్షకులు.
కానీ ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫలితం రవితేజ, హరీష్ శంకర్‌లతో పాటు నిర్మాతలకూ పెద్ద షాక్. నష్టాలు మరీ ఎక్కువగా ఉండడంతో రవితేజ, హరీష్ తమ పారితోషకాల్లోంచి కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. ‘రైడ్’ మూవీకి హిందీలో సీక్వెల్ తెరకెక్కుతుండడం విశేషం. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ‘రైడ్-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రైడ్’లో అమేయ్ పట్నాయక్‌గా అదరగొట్టిన అజయ్ దేవగణే ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు. కొత్తగా రితీశ్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ తదితరులు ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. ‘రైడ్’ తీసిన రాజ్ కుమార్ గుప్తానే దీన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు. టీ సిరీస్ నిర్మాణంలో తెరకెక్కుతోందీ చిత్రం. ఈ అనౌన్స్‌మెంట్ రాగానే మన తెలుగు నెటిజన్లు ‘మిస్టర్ బచ్చన్’ టీం మీద కౌంటర్లు మొదలుపెట్టారు. దీన్ని కూడా రీమేక్ చేస్తారా అంటున్నారు.
‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్ల టైంలో రవితేజ, హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘రైడ్’ హీరో అజయ్ దేవగణ్ అండ్ టీం ‘మిస్టర్ బచ్చన్’ చూశారంటే ‘ఆహ్’ అని ఆశ్చర్యపోయి మళ్లీ దీన్ని వాళ్లు రీమేక్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను తీసుకొచ్చి పోస్ట్ చేస్తూ వాళ్లు రీమేక్ చేస్తున్నది ‘మిస్టర్ బచ్చన్’నే కావచ్చు అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on September 12, 2024 3:09 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…