నిన్న జరిగిన 35 చిన్న కథ కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ నాని, రానా మధ్య ఎంత స్నేహం ఉందో మరోసారి చాటింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 6 విడుదల కానుంది. ఇవాళ రేపు ఎంపిక చేసిన నగరాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారు. నివేదా థామస్ పిల్లల తల్లిగా ప్రధాన పాత్ర పోషించగా ప్రియదర్శి స్పెషల్ రోల్ చేశాడు. మిగిలిన క్యాస్టింగ్ లో స్టార్లు లేకపోయినా క్వాలిటీ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. గోట్, జనక అయితే గనక పోటీ ఉన్నప్పటికీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన నాని మిత్రుడు రానాని పొగడ్తలతో ముంచెత్తాడు.
టాలెంట్ వెతికి పట్టుకోవడంలో అందరూ తన గురించి ప్రస్తావిస్తారని, కానీ ఈ విషయంలో ఎవరైనా సరే రానా తర్వాతే ఉంటారని, కేవలం ఇండస్ట్రీ కోసమే కాక ఏ రంగంలో కొత్త ప్రతిభ ఉన్నా తీసుకొచ్చి మరీ ప్రోత్సహిస్తాడని అన్నాడు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో మొదట పరిచయమయ్యింది రానానే అని అలా ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాడు. ఎప్పుదైనా ఖాళీ సమయం దొరికితే రానాతోనే గడిపేందుకు ఇష్టపడతానని చెప్పిన నాని 35 చిన్న కథ చూశానని, సరిపోదా శనివారం లాంటివి వస్తుంటాయి కానీ ఇలాంటి అద్భుతం అనిపించే చిన్న సినిమాలు మాత్రం మిస్ కావొద్దని ప్రేక్షకులను కోరాడు.
రానా మాట్లాడుతూ తాను ఇలా సింపుల్ గా మారిపోవడానికి కారణమంటూ నాని మీద తన అభిమానం ప్రదర్శించాడు. సరదాగా జరిగిన ఈ వేడుకలో రెగ్యులర్ గా అనిపించే స్కిట్లు, డాన్సులు కాకుండా నవ్వుకుంటూ చేసిన సంభాషణలు హైలైట్ గా నిలిచాయి. నిన్ను కోరిలో జంటగా నటించి మెప్పించిన నాని, నివేదా థామస్ పరస్పరం కౌగిలించుకోవడం హైలైట్ మూమెంట్స్ లో ఒకటి. మొత్తానికి పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ ఉన్న 35 చిన్న కథ కాదు ఇప్పుడీ ఈవెంట్ వల్ల ఆడియన్స్ దృష్టిలో పడింది. పిల్లలు, తల్లితండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమాగా టీమ్ పదే పదే చెబుతోంది.
This post was last modified on September 4, 2024 3:36 pm
ఏపీలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే.. దీనికి తాజాగా సీఎం చంద్ర బాబు ప్రాథమిక…
బుమ్రా ఎప్పట్లాగే అదరగొట్టాడు. మిగతా బౌలర్లూ రాణించారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత శతకం సాధించాడు. యశస్వి…
ఏపీ పోలీసుల పనితీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల తీరు సరిగాలేదని…
ఇండియన్ వెబ్ సిరీస్‌ల్లో అత్యంత ఆదరణ పొందింది ఏది అంటే మరో మాట లేకుండా ‘ఫ్యామిలీ మ్యాన్’ అని చెప్పేయొచ్చు.…
మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి 'తెలుగు తల్లికి జల హారతి' అనే పేరును…