Movie News

బిగ్ బాస్ ఓటర్లు మరోసారి తప్పులో కాలేశారా?

‘బిగ్ బాస్’లో ఇంకో వారం గడిచిపోయింది. మరో పోటీదారు షో నుంచి వైదొలగక తప్పలేదు. ఆ కంటెస్టంటే.. దేవి నాగవల్లి. ఈ టీవీ9 యాంకర్.. ఎప్పుడు ఎలిమినేషన్లోకి వస్తే అప్పుడు షో నుంచి బయటికి రాక తప్పదని ఒక ముద్ర ముందే పడిపోయింది. అనుకున్నట్లే ఆమె ఎలిమినేషన్లోకి రావడం ఆలస్యం.. వేటు పడిపోయింది. ఐతే బిగ్ బాస్‌లో మూడు వారాల పాటు ఆమె నడవడికను పరిశీలిస్తే మాత్రం ప్రేక్షకులు తప్పులో కాలేశారేమో అనిపించడం ఖాయం.

తొలి వారం షో నుంచి ఎగ్జిట్ అయిన సూర్యకిరణ్ సంగతే తీసుకుంటే.. అతను కొంచెం అగ్రెసివ్‌గా కనిపించడం, తగువులు పెట్టుకోవడంతో వెంటనే నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది. దీంతో అతడి మీద ప్రేక్షకులు వ్యతిరేకత చూపించి షో నుంచి బయటికొచ్చేలా చేశారు. ఐతే ఎలిమినేట్ అయ్యాక హౌస్ నుంచి బయటికొచ్చి సహచరులు ఒక్కొక్కరి గురించి సూర్యకిరణ్ విశ్లేషించిన తీరు, తన మాటల్లో మెచ్యూరిటీ చూశాక తప్పులో కాలేశామా అన్న భావన ప్రేక్షకుల్లో కలిగింది. ఒక వ్యక్తిని త్వరగా జడ్జ్ చేయకూడదనడానికి సూర్యకిరణ్ ఒక ఉదాహరణగా నిలిచాడు.

కట్ చేస్తే ఇప్పుడు దేవి వైదొలిగిన అనంతరం కూడా పలువురిలో ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవిని టీవీ 9 యాంకర్ అన్న కోణంలోనే చూశారు జనాలు. ఆ ఛానెల్ పట్ల జనాల్లో ఉన్న వ్యతిరేకత ఆమెపై పడింది. టీవీ9ను పక్కన పెట్టి దేవి అంటే ఏంటి అనేది జనాలు చూడలేదు. నిజానికి ఆమె హౌస్‌లో హుందాగానే ఉంది. పరిణతితో వ్యవహరించింది. ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని షోను పూర్తిగా ఫాలో అయిన వాళ్లు అర్థం చేసుకున్నారు.

ఐతే టీవీ9 పట్ల ఉన్న వ్యతిరేకతతో దేవి ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అని తెలియడం ఆలస్యం.. గేమ్ మొదలు కాకముందే ఆమె ఎలిమినేషన్ కోసం నెటిజన్లు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జనసేన మీద విషం కక్కుతోందన్న కారణంతో టీవీ9 ఛానెల్ మీద కోపం పెంచుకున్న మెగా అభిమానులు దేవిని ఎలాగైనా బయటికి పంపించాలని కాచుకుని ఉన్నారు. ఆమె ఎలిమినేషన్లోకి రావడం ఆలస్యం.. షో చూడని వాళ్లు కూడా దేవికి వ్యతిరేకంగా పని చేసి అనుకున్నది సాధించారు. దీంతో మరో మంచి కంటెస్టెంట్ షోకు దూరమైంది.

This post was last modified on September 28, 2020 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దావోస్ లో ఇరగదీస్తున్న సీఎం రేవంత్..

ఒకటి తర్వాత ఒకటి అన్నట్లుగా అంతకంతకూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దావోస్ కు…

21 minutes ago

స్టార్ హీరో సినిమాకు డిస్కౌంట్ కష్టాలు

బాలీవుడ్ లో పట్టువదలని విక్రమార్కుడు పేరు ఎవరికైనా ఉందంటే ముందు అక్షయ్ కుమార్ గురించే చెప్పుకోవాలి. ఫలితాలను పట్టించుకోకుండా విమర్శలను…

1 hour ago

అక్కడ చంద్రబాబు బిజీ… ఇక్కడ కల్యాణ్ బాబూ బిజీ

ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ లో జరుగుతున్నవరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన సీఎం నారా చంద్రబాబునాయుడు గడచిన నాలుగు…

1 hour ago

రానా నాయుడు 2 జాగ్రత్త పడుతున్నాడు

వెంకటేష్ కెరీర్ లో మొదటి వెబ్ సిరీస్ గా వచ్చిన రానా నాయుడుకు వ్యూస్ మిలియన్లలో వచ్చాయి కానీ కంటెంట్…

2 hours ago

కారుపై మీడియా లోగో… లోపలంతా గంజాయి బస్తాలే

అసలే గంజాయిపై ఏపీలోని కూటమి సర్కారు యుద్ధమే ప్రకటించింది. ఫలితంగా ఎక్కడికక్కడ పోలీసులు వాహనాల తనిఖీలు కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన…

2 hours ago

అచ్చెన్న నోటా అదే మాట!.. అయితే వెల్ బ్యాలెన్స్ డ్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి; ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలంటూ మొన్నటిదాకా టీడీపీ…

2 hours ago