సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అన్యాయంగా ప్రాణాలు వదిలాడని.. అతడి మృతికి కారణమెవరో తేలాలని.. అతడికి న్యాయం జరగాలని తన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేస్తూ వచ్చారు మూడు నెలలుగా. ఐతే అతడి మృతి కేసు తేలడం సంగతటుంచితే.. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద రోజు రోజుకూ నిందలు పెరిగిపోతూ అతడి అప్రతిష్టపాలయ్యే పరిస్థితి తలెత్తుతోంది.
చనిపోయాక ఒకట్రెండు నెలల పాటు సుశాంత్ మంచి లక్షణాల గురించే చర్చ జరిగింది. అతడి గురించి అందరూ అయ్యో పాపం అన్నట్లే మాట్లాడారు. సుశాంత్‌కు సామాజిక మాధ్యమాల్లో లభించిన ఆదరణ చూసో ఏమో.. బాలీవుడ్లో ఎవ్వరూ కూడా అతడి గురించి నెగెటివ్‌గా ఒక్క మాట మాట్లాడే సాహసం చేయలేదు. కానీ ఈ కేసు టర్న్ తీసుకుని డ్రగ్స్ వైపు మళ్లడం ఆలస్యం వ్యవహారం మారుతూ వచ్చింది.
కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు, రియా చక్రవర్తి సహా కొందరు ఆంతరంగిక సంభాషణల్లో, అధికారుల ముందు మాట్లాడుతున్న మాటలు చూస్తే.. అతణ్ని ఒక పెద్ద డ్రగ్ ఎడిక్ట్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని వాళ్లన్నారు.. వీళ్లన్నారు అంటూ బాలీవుడ్లో అదే పనిగా వార్తలు వస్తున్నాయి. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ముందుకు విచారణ కోసం వెళ్లిన సుశాంత్ కోస్టార్లు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ ఇద్దరూ కూడా సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా చెప్పినట్లుగా మీడియా సంస్థలు చెబుతున్నాయి.
ఐతే తనపై ఏ ఆరోపణ వచ్చినా ఖండించడానికి ఇప్పుడు సుశాంత్ లేడు. అతనేమీ బాలీవుడ్లో బడా ఫ్యామిలీకి చెందిన వాడు కాదు. బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇంకేముంది నింద అతడి మీదికి నెట్టేసి తాము సైడ్ అయిపోదామని బాలీవుడ్ తారలు చూస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ఇప్పటికే సుశాంత్ మృతి కేసు పూర్తిగా పక్కదోవ పట్టగా.. తాజా పరిణామాలు చూస్తుంటే సుశాంత్ ఎంతగా వీలైతే అంతగా చెడగొట్టడానికీ ప్రయత్నం జరుగుతున్నట్లుంది.
This post was last modified on September 28, 2020 11:33 am
ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా…
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…