ఎస్.జె.సూర్య అంటే ఒకప్పుడు వాలి, ఖుషి లాంటి బ్లాక్‌బస్టర్స్ తీసిన దర్శకుడే గుర్తుకు వచ్చేవాడు. కానీ గత దశాబ్ద కాలంలో అతడిలోని ఫిలిం మేకర్ వెనక్కి వెళ్లిపోయి.. నటుడు హైలైట్ అయ్యాడు. ‘నాని’ సినిమాను తమిళంలో తీయాలనుకున్నపుడు అజిత్ నిరాకరించడంతో అనుకోకుండా తనే లీడ్ రోల్ చేశాడు సూర్య.
తెలుగులో డిజాస్టర్ అయిన ఆ చిత్రం.. తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయిపోయింది. నటుడిగా సూర్యకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వేరే దర్శకుల కళ్లు అతడిపై పడ్డాయి. ఈ క్రమంలో అతడి నుంచి కొన్ని సెన్సేషనల్ పెర్ఫామెన్సెస్ వచ్చాయి.
అందులో ‘ఇరైవి’లో చేసిన దర్శకుడి పాత్ర ఒకటి. ఆ తర్వాత విలన్ పాత్రలతో అతను చెలరేగిపోయాడు. ‘స్పైడర్’ డిజాస్టర్ అయినా.. అందులో సూర్య చేసిన సైకో విలన్ పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.
తమిళంలో సూర్యకు సైకో క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అతను చెలరేగిపోయాడు. నెంజం మరప్పదిల్లై, మానాడు లాంటి సినిమాల్లో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ కెరీర్ ఆరంభంలో ఆయన సైకో విలన్ పాత్రలు వేస్తే భలే అనిపించేది.
ఇప్పుడు సూర్య విషయంలోనూ ప్రేక్షకులు అలాగే ఫీలవుతున్నారు. కొంచెం తేడాగా ప్రవర్తించే పాత్ర పడితే.. సూర్య శైలికి బాగా నప్పుతోంది. ‘సరిపోదా శనివారం’లోనూ సైకో తరహా పాత్రే చేశాడు సూర్య. తన అన్న ఆస్తి విషయంలో చేసిన మోసానికి కోపం వచ్చినపుడల్లా సోకుల పాలెం అనే ఊర్లోకి వెళ్లి అమాయకులను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టే పాత్ర చేశాడు సూర్య.
తన పైశాచికత్వం చూపించే సన్నివేశాల్లో సూర్య చెలరేగిపోయాడు. సినిమాలో సూర్య కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు అలెర్టవుతారు. ఆసక్తిగా ఆ సన్నివేశాలను ఫాలో అవుతారు. ఆరంభం నుంచి చివరి వరకు అదిరే పెర్ఫామెన్స్‌తో నాని లాంటి పెర్ఫామర్‌ను కూడా డామినేట్ చేయగలిగాడు సూర్య. ఈ సినిమా తర్వాత సూర్య కోసం మరిన్ని సైకో క్యారెక్టర్లు తయారైతే ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 29, 2024 10:40 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…