నాని కెరీర్ లోనే అత్యధిక అంచనాలు మోస్తున్న సినిమాగా సరిపోదా శనివారం థియేటర్లలో అడుగు పెట్టేసింది. కేవలం తన అభిమానులే కాకుండా సగటు సినీ ప్రియులు, ఇండస్ట్రీ వర్గాలు దీని గురించే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అమెరికా ప్రీమియర్ల నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ రావడం శుభ సంకేతం. ఇక్కడ కూడా అదే తరహా స్పందన దక్కితే నానికి మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టే. దసరా, హాయ్ నాన్న తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం ఫ్యాన్స్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉండటమే కాక ప్రీమియం స్క్రీన్లన్నీ ముందస్తుగానే హౌస్ ఫుల్ కావడం విశేషం.
సుమారు నలభై కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకున్న సరిపోదా శనివారంకు హిట్ టాక్ వస్తే దాన్ని అందుకోవడం కష్టమేమీ కాదు. పైగా మొన్న ఆగస్ట్ 15 వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి పెద్ద సినిమాలు నిరాశ పరచడంతో మాస్ ఆడియన్స్ చూపంతా నాని మూవీ మీదే ఉంది. యుఎస్ మొదటి రోజే అర మిలియన్ దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రం గురించి ఇంత చర్చ జరిగేందుకు మరో కారణం ఉంది. ఇది కనక అంచనాలు అందుకోగలిగితే నాని టయర్ 1 హీరోలకు దగ్గరవుతాడు. నిర్మాణంలో ఉన్న వాటి బడ్జెట్ మీద మరింత భరోసా దక్కుతుంది.
ఊపిరి తీసుకుంటున్నాడా లేడా అనిపించే రేంజ్ లో నాని చేసిన విస్తృత్ర ప్రమోషన్లు సరిపోదా శనివారంకు ఉపయోగపడుతున్నాయి. మన సినిమాలను అంతగా పట్టించుకోని తమిళనాడులో సైతం ఈసారి పాజిటివ్ వైబ్స్ తెలుస్తున్నాయి. కోలీవుడ్ దత్త పుత్రుడు అంటూ నానిని ఓన్ చేసుకునే ప్రయత్నం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. తనతో పాటు ప్రియాంక మోహన్, ఎస్జె సూర్యల ఇమేజ్ మార్కెట్ పరంగా ఉపయోగపడుతోంది. ఇన్ని సానుకూలతలు మధ్య సరిపోదా శనివారం కనక హిట్ టాక్ అందుకునే టాలీవుడ్ బాక్సాఫీస్ భారంగా ఎదురు చూస్తున్న మాస్ బొమ్మ కరువు తీరిపోయినట్టే. చూద్దాం.
This post was last modified on August 29, 2024 10:00 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…