ఇంకో వారం రోజుల్లో సెప్టెంబర్ 5న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) రిలీజ్ కాబోతోంది. మాములుగా విజయ్ సినిమా అంటేనే ఓ రేంజ్ హడావిడి ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా తెలిసిందే. తెలుగులోనూ తన క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. గత ఏడాది బాలకృష్ణ, రవితేజ పోటీని తట్టుకుని లియో ఇక్కడ కమర్షియల్ గా సక్సెస్ కావడం అంటే మాటలు కాదు. అందుకే తన కొత్త మూవీ వస్తోందంటే దాని థియేటర్, డిస్ట్రిబ్యూషన్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. గోట్ కు మంచి సపోర్ట్ అయితే ఉంది కానీ ఆశించిన బజ్ లేదనేది ఫ్యాన్స్ భావన.
ఇక్కడ రెండు అంశాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. మొదటిది వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డు. నాగ చైతన్యతో కస్టడీ అనే కళాఖండం తీసింది ఈయనే. ఒకప్పుడు అజిత్ గ్యాంబ్లర్, సూర్య రాక్షసుడు లాంటి న్యూ ఏజ్ థ్రిల్లర్స్ తీశారు కానీ ఇప్పుడు ఫామ్ లో లేని డొల్లతనం చైతు మూవీలో బయట పడింది. సో వెంకట్ ప్రభు బ్రాండ్ పని చేయడం లేదు. ఇక విజయ్ సినిమాల స్థాయిని పదింతలు పెంచే అనిరుద్ రవిచందర్ స్థానంలో యువన్ శంకర్ రాజా రావడం బజ్ ని తగ్గించేసింది. పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ అంచనాలు పెంచడంలో అవి ఉపయోగపడలేదు.
వీటికి తోడు విజయ్ డీ ఏజింగ్ మీద వచ్చిన కామెంట్స్, నెగటివ్ ఫీడ్ బ్యాక్ డ్యామేజీని మరింత పెంచాయి. తమిళంలో ప్రమోషన్లు నాన్ స్టాప్ గా చేస్తున్నారు కానీ తెలుగులో ఇంకా మొదలుపెట్టలేదు. ఎలాగూ విజయ్ హైదరాబాద్ కు రాడు. సో హీరోయిన్ మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, లైలాలను తీసుకొచ్చి ఏదోలా మేనేజ్ చేయాలి. రాజకీయ పార్టీ పెట్టేసిన విజయ్ ఎన్నికలకు వెళ్లేముందు చేయబోయే చివరి రెండు సినిమాల్లో ఇది మొదటిది. ఆ కారణంగా అయినా కనివిని ఎరుగని హైప్ వస్తుందని అందరూ భావించారు. దానికి భిన్నంగా గోట్ పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఇదండీ కథ.
This post was last modified on August 28, 2024 4:31 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…