మహేష్ అసలు ఎక్సైట్ అవలేదేంటబ్బా?

ఇండియాలో ఇప్పుడు ఏ హీరోకి అయినా రాజమౌళితో సినిమా చేయాలనేది డ్రీం అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ హీరోలు సైతం అతని కోసం సిద్ధంగా ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్. అనౌన్స్ చేసినపుడు తారక్, చరణ్ ఎంత ఎక్సైట్ అయ్యారో చూసే ఉంటారు. రాజమౌళితో సినిమా అనగానే సదరు హీరో అభిమానికి కూడా పండగ లాంటిదే.

అయితే తన మలి చిత్రం మహేష్ తో ఉంటుందని రాజమౌళి స్పష్టం చేసి చాలా రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు మహేష్ దీనిపై మాట మాత్రంగా అయినా స్పందించలేదు. మహేష్ ని అడిగి ప్రకటించాడో లేదో తెలియదు కానీ మహేష్ అయితే ఈ చిత్రం విషయంలో సైలెంట్ గానే ఉన్నాడు.

అసలు తన తదుపరి చిత్రం పరశురామ్ తో ఉంటుందని గానీ, వంశి పైడిపల్లితో అనుకున్న సినిమా స్టేటస్ ఏమిటని కానీ మహేష్ ఇంత వరకు ఏమీ చెప్పలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నా కానీ తాను చేయబోయే సినిమాల విషయంలో మహేష్ అధికారిక ప్రకటనలు ఇవ్వడంలేదు.