కల్కి 2898 ఏడి కన్నా ముందు ఈ సంవత్సరం అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా హనుమాన్. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ డ్రామా భారీ వసూళ్లతో ట్రేడ్ మతులు పోగొట్టింది. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున పోటీని తట్టుకుని విజేతగా నిలవడం మాటలు కాదు. అప్పటిదాకా హౌస్ అరెస్ట్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ లాంటి చిన్న చిత్రాలతో పెద్దగా లైమ్ లైట్ లేకుండా ఉన్న ప్రైమ్ షో బ్యానర్ అమాంతం టాప్ రేసులోకి వచ్చేసింది. ఈ మధ్య ప్రియదర్శి డార్లింగ్ నిరాశ పరిచినా డిజిటల్, శాటిలైట్ తదితరాల రూపంలో సేఫ్ అయ్యిందనే టాక్ పరిశ్రమలో ఉంది.
ఇదంతా కాసేపు పక్కనపెడితే ఇటీవలే రిలీజైన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులను సుమారు యాభై అయిదు కోట్లకు పైగా ప్రైమ్ షో కొనుగోలు చేసినట్టు వచ్చిన వార్త విదితమే. అంత పెట్టుబడి పెట్టారు కాబట్టే టైటిల్ కార్డులో సంస్థ పేరుని వేసుకున్నారు. తీరా చూస్తే సినిమా దారుణంగా పోయింది. రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే డెఫిషిట్లు మొదలవ్వడం నష్టాల శాతం పెంచింది. పోటీలో ఉన్న మిస్టర్ బచ్చన్ దీ ఇదే పరిస్థితి అయినా ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ ఇమేజ్ సైతం సీక్వెల్ కి పనిచేయలేదు. మొదటి షో నుంచే వచ్చిన నెగటివ్ టాక్ కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపించింది.
అంటే హనుమాన్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్ 2 తీసుకున్నాడన్న మాట. నష్టాల రికవరికి పూరి జగన్నాథ్ తన రెమ్యునరేషన్ నుంచి కొంత వెనక్కి ఇచ్చేలా హామీ వచ్చిందని అంటున్నారు కానీ ఎంతమేరకు నిజమో చూడాలి. అయినా కేవలం కాంబోల మీద నమ్మకంతో మార్కెట్ లో ఉన్న డిమాండ్ కన్నా ఎక్కువ రేట్ పెడితే ఇలాంటి ఫలితాలు రిపీటవుతూనే ఉంటాయి. ఇంతకు ముందు లైగర్ వరంగల్ శీనుని దెబ్బ కొడితే ఈసారి స్ట్రోక్ నిరంజన్ రెడ్డికి తగిలింది. ఊహించని విధంగా ఆయ్, కమిటీ కుర్రోళ్ళు దూసుకుపోవడం ట్రేడ్ తో సహా ఎవరూ ఊహించని పరిణామం. అందుకే కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు.
This post was last modified on August 22, 2024 1:20 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…