హీరో నాని, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి కలయికలో ఒక సినిమా రూపొందుతుందనే ప్రచారం గత ఏడాది గట్టిగా తిరిగింది. అయితే కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల డ్రాపయ్యారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు సరిపోదా శనివారం ప్రెస్ మీట్ లో నాని చెక్ పెట్టేశాడు. తన వెర్షన్ ప్రకారం బలగంని విపరీతంగా ఇష్టపడిన నాని దాన్ని చాలా చోట్ల ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రమోట్ చేశాడు. అంతగా హృదయాన్ని హత్తుకుంది. దీంతో వేణు కూడా నాని ఇంతగా తన చిత్రాన్ని దగ్గర చేసుకోవడం చూసి క్రమం తప్పకుండా టచ్ లో ఉండేవాడు.
ఓ సందర్భంగాలో దిల్ రాజు ఎలాంటి దర్శకుల కోసం చూస్తున్నావని నానికి అడిగారు. దానికి సమాధానం చెబుతూ వేణు మీద నాకు ఆసక్తి ఉంది, ఫెంటాస్టిక్ నటుడిగానే కాక డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అలాంటి కాంబో కోసం చూస్తున్నానని నాని అన్నాడు. సరదాగా మొదలైన ఈ సంభాషణ పలుమార్లు ముగ్గురి మధ్య డిస్కషన్ గా మారిపోయింది. ఇది కాస్తా బయటికి వెళ్లిపోవడంతో ఈ కాంబినేషన్ ఫిక్సనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతే తప్ప నిజంగా అప్పటికప్పుడు చేయాలనే ఆలోచన తప్ప కథ లేదని నాని చెప్పిన సారాంశం.
భవిష్యత్తులో మాత్రం వేణుతో ఖచ్చితంగా సినిమా చేసే అవకాశాన్ని నాని స్పష్టంగా చెప్పేశాడు. సో ఫ్యాన్స్ ఎదురు చూడొచ్చు. సరిపోదా శనివారం ప్రమోషన్ల మల్టీ లాంగ్వేజ్ ప్రమోషన్లలో ఎడతెరిపి లేకుండా పాల్గొంటున్న నాని ఏ మాత్రం అలసట లేకుండా ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా చాలా విశ్లేషణాత్మకంగా, వివరంగా సమాధానం చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక మీమర్ నానిని విలన్ ఎస్జె సూర్యతో నటిస్తున్నప్పుడు భయం వేయలేదా అనే ప్రశ్నకు సంయమనం కోల్పోకుండా నాకెందుకు భయమంటూ కూల్ గా చెప్పిన తీరు వీడియో రూపంలో వైరలవుతోంది.
This post was last modified on August 21, 2024 5:22 pm
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…