అనుకున్న దానికన్నా ఎక్కువగా డబుల్ ఇస్మార్ట్ ఫెయిల్ కావడం రామ్, పూరి జగన్నాధ్ ఇద్దరి అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది. ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి దక్కాల్సిన రెస్పాన్స్ ఇది కాదని బాధ పడుతున్నారు. పుష్ప 2 వదిలేసిన ఆగస్ట్ పదిహేను లాంటి మంచి సీజన్ ని చేతులారా వృథా చేసుకుని ఆయ్ లాంటి చిన్న చిత్రాలు దూసుకుపోయేలా చేయడం అంత ఈజీగా తీసిపారేసే మ్యాటర్ కాదు. దీనికి బాధ్యులు ఎవరనే దాని కన్నా టైటిల్ లో ఉన్న స్మార్ట్ నెస్ మేకింగ్ లో చూపించలేకపోయిన దర్శకుడు, దాన్ని స్క్రిప్ట్ స్టేజిలోనే గుర్తించలేకపోయిన హీరో ఇద్దరూ తలా సగం పంచుకోవాలి.
స్మార్ట్ గా ఆలోచించడం అంటే ఏమిటో అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు గమనించాలి. కమర్షియల్ సినిమా ఎప్పుడూ మాస్ పరిమితుల్లోనే ఉంటుంది. దాన్ని దాటి రిస్క్ చేయలేం. కాకపోతే కొత్త తరానికి తగ్గట్టు స్టయిలిష్ మేకింగ్ అంటే ఏంటో అవగాహన పెంచుకోవాలి. జైలర్ సంగతే చూస్తే అదేమీ అద్భుతమైన మాస్టర్ పీస్ కాదు. కమల్ హాసన్ భారతీయుడులో చెడ్డ కొడుకుని ఇందులో వాడారు. తాత వయసొచ్చిన హీరో తన కుటుంబం మీదకొచ్చిన వాళ్ళను అంతం చేయడమే పాయింట్. లియోలో తీసుకున్నది కనివిని ఎరుగని ప్లాట్ కాదు. జగపతిబాబు గాయం 2 ఛాయలు చాలా ఉంటాయి.
సలార్ తీసిన ప్రశాంత్ నీల్, యానిమల్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, కల్కితో ఋజువు చేసుకున్న నాగ్ అశ్విన్ వీళ్ళందరూ మోడరన్ మేకింగ్ కి ప్రతినిథులు. కానీ పూరి మాత్రం ఇంకా ఇరవై సంవత్సరాల నాటి బోకా లాంటి కామెడీలు, చిప్పు మారిపోయిన ఇస్మార్ట్ శంకర్ ట్విస్టుల మీదే ఆధారపడటం సంజయ్ దత్ లాంటి విలన్ ని సైతం డమ్మీని చేసింది. రామ్ కూడా మూసలో పడి మార్కెట్ ని ఎంత దెబ్బ తీసుకుంటున్నాడో ది వారియర్, స్కందలు హెచ్చరిక చేసినప్పటికీ కేవలం బ్రాండ్ ని నమ్ముకుని డబుల్ ఇస్మార్ట్ చేశాడు. కథలు మాస్ గా ఉండటం కాదు మేకింగ్, రైటింగ్ స్మార్ట్ గా ఉంటేనే హిట్లు పడతాయి.
This post was last modified on August 20, 2024 7:33 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…