బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న మూవీ స్త్రీ 2. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ట్రెండ్ కి శ్రీకారం చుట్టి పోటీలో ఉన్న ఇతర సినిమాలను ఊసులో లేకుండా చేస్తున్న ఈ క్రేజీ చిత్రానికి వస్తున్న వసూళ్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటి రోజు నెంబర్లు ఆశించిన దానికన్నా భారీగా ఉండటంతో నిర్మాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15 తేదీని వదులుకోగానే దాన్ని ఒడిసిపట్టుకోవడం స్త్రీ 2కి చాలా కలిసి వస్తోంది. మొదటి భాగానికి క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ సీక్వెల్ కి ఈ స్థాయిలో స్పందన ఊహించనిది. ఇంతకీ సినిమా ఎలా ఉందో సింపుల్ గా చూసేద్దాం.
స్త్రీ 1లో చూసిన స్త్రీ పీడా తప్పిపోయిందని చండేరీ జనాలు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఎప్పటికైనా తన ప్రియురాలు తిరిగి వస్తుందని ఎదురు చూస్తుంటాడు విక్కీ (రాజ్ కుమార్ రావు). సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊళ్ళో అమ్మాయిలను మాయం చేయడం మొదలుపెడుతుంది. విక్కీ ఫ్రెండ్ లవర్ సైతం ఇలాగే అదృశ్యమవుతుంది. దీంతో నలుగురు స్నేహితుల గ్యాంగ్ కలిసి స్త్రీ (శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. అక్కడి నుంచి అసలు సవాల్ మొదలవుతుంది. తల మొండెం వేరుగా ఉండే దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలకు స్త్రీ బృందం ఎలా విముక్తి కలిగించిందనేది స్టోరీ.
దర్శకుడు అమర్ కౌశిక్ స్త్రీ కథలోని ట్విస్టుని రివర్స్ లో రాసుకున్నా స్క్రీన్ ప్లేలో చూపించిన వైవిధ్యం, ఎంగేజ్ అయ్యేలా టెక్నికల్ టీమ్ మద్దతుతో అవుట్ ఫుట్ రాబట్టుకున్న వైనం స్త్రీ 2 బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా చూసేలా చేసింది. కామెడీ, హారర్ రెండింటిని బ్యాలన్స్ చేసిన తీరు సంతృప్తి కలిగిస్తుంది. దెయ్యాన్ని ఏం చేయాలో తెలిశాక నడిపించిన డ్రామా కొంత సాగతీతకు గురైనప్పటికీ దానికి ముందు వెనుకా ఉన్న బలమైన కంటెంట్ వల్ల ఇబ్బందిగా అనిపించదు. సర్ ఖటా డెన్నులోకి ప్రవేశించాక జరిగే ఎపిసోడ్ ప్రధాన హైలైట్. ముఖ్యంగా ఆర్టిస్టుల నటన స్త్రీ 2 స్థాయిని అమాంతం పెంచేసింది. తమన్నా ఐటెం సాంగ్ బోనస్.
This post was last modified on August 17, 2024 10:00 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…