టాలీవుడ్లో ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ మూవీస్ చేస్తూ.. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న నటుడు నేచురల్ స్టార్ నాని. గత ఏడాది ‘దసరా’ లాంటి ఊర మాస్ మూవీతో మెప్పించిన అతను.. ఆపై ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను ‘సరిపోదా శనివారం’ అనే క్లాస్, మాస్ మిక్స్ చేసిన సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
నాని ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మొన్నటిదాకా కొంచెం గందరగోళం నెలకొంది. క్లారిటీ మిస్ అయింది. ‘బలగం’ ఫేమ్ వేణుతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కాగా.. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్‌తో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అలాగే హిట్-3 సంగతేంటి.. ‘దసరా’ తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెలతో జట్టు కడతాడా లేదా అనే డౌట్లు కూడా వచ్చాయి.
ఐతే ఇప్పుడు నాని లైనప్ మీద పూర్తి స్పష్టత వచ్చేసినట్లే కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెలతోనే నాని తర్వాతి చిత్రం ఉండబోతోంది. దాంతో పాటుగా హిట్-3ని కూడా సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు నాని. వీటి గురించి సెప్టెంబరు తొలి వారంలో అధికారిక ప్రకటనలు వస్తాయి. అంతే కాక సుజీత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా నాని తెరదించేశాడు.
సుజీత్‌తో సినిమాను కన్ఫమ్ చేయడమే కాక.. అభిమానులు ఎప్పట్నుంచో తనను చూడాలనుకుంటున్న పవర్ ఫుల్, ఫెరోషియస్, మాస్ అవతారంలో తనను సుజీత్ ప్రెజెంట్ చేయబోతున్నట్లు అతను చెప్పడం విశేషం. ‘ఓజీ’ లాంటి మెగా మూవీ తర్వాత నానితో సుజీత్ సినిమా చేయడమే కాక.. అతణ్ని పవర్ ఫుల్, మాస్ రోల్‌లో చూపించబోతున్నాడు అంటే నేచురల్ స్టార్ కెరీర్ మరో స్థాయికి వెళ్లబోతున్నట్లే. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చాలా ఎగ్జైటింగ్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 16, 2024 4:22 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…