Movie News

ఇండియన్ సీక్వెల్స్.. 500 కోట్లా?

గత నెల ఇదే సమయంలో రిలీజై దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది ‘ఇండియన్-2’ సినిమా. ముందు నుంచే ఆ సినిమాకు హైప్ తక్కువే ఉంది. సినిమా బాగా ఆలస్యం కావడం, దీనికి తోడు ట్రైలర్ ఇంప్రెసివ్‌గా లేకపోవడంతో బజ్ క్రియేట్ కాలేదు.

ఐతే శంకర్ ఏదో ఒక మ్యాజిక్ చేసే ఉంటాడనే ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు తల బొప్పి కట్టింది. శంకర్ కెరీర్లోనే అట్టడుగున నిలిచే చిత్రం ఇదే అనడంలో మరో మాట లేదు. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ వంద కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దీంతో నిర్మాతల పరిస్థితి ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే ‘ఇండియన్-2’ బడ్జెట్ రూ.250 కోట్లని వార్తలు వచ్చాయి. ఐతే దీంతో పాటుగా మూడో పార్ట్ కూడా తీశారు కాబట్టి.. దానికి కూడా కలిపే ఈ బడ్జెట్ అనుకున్నారందరూ.

కానీ ‘ఇండియన్-2’; ‘ఇండియన్-3’కి కలిపి శంకర్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు పెట్టించేశారట. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ‘ఇండియన్’ సీక్వెల్స్ బడ్జెట్ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పారు. ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి ఆరేళ్లు పట్టిందని.. మధ్యలో క్రేన్ ప్రమాదం జరిగి షూటింగ్ ఆగిపోవడం, బడ్జెట్ హద్దులు దాటిపోవడంతో శంకర్ మీద ఫిర్యాదు చేయడానికి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న తననే ‘లైకా’ అధినేత సుభాస్కరన్ సంప్రదించాడని ప్రసాద్ వెల్లడించారు. అప్పుడు శంకర్‌ను పిలిపించి మాట్లాడామని ప్రసాద్ తెలిపారు.

ముందు ఒక బడ్జెట్ అనుకున్నాక.. దాన్ని రూ.230 కోట్లకు పెంచి అగ్రిమెంట్ చేసుకున్నారని.. ఐతే ఆ బడ్జెట్ కూడా సరిపోక ఇంకో రూ.170 కోట్లు ఇచ్చారని.. చివరికి దాన్ని కూడా మించిపోయి ఏకంగా రూ.500 కోట్లు ఖర్చయినట్లు తనకు సమాచారం ఉందని ప్రసాద్ వెల్లడించారు. ముందు శంకర్‌తో ఘర్షణ వైఖరే ఉన్నప్పటికీ.. సినిమా పూర్తి కావడం కోసం నిర్మాతలు ఆయనతో రాజీకి వెళ్లారని.. కానీ శంకర్ ప్రతిసారీ చెప్పిన బడ్జెట్లో సినిమా తీయకుండా అదనంగా భారీగా ఖర్చు పెట్టించాడని ‘లైకా’ అధినేతల కష్టాలను ఏకరవు పెట్టారు.

Satya

Recent Posts

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

37 minutes ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

2 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

3 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

5 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

11 hours ago