ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సరైన మాస్ సినిమాలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ అంచనాలను అందుకోవడంలో విఫలం కాగా.. తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకునే పూర్తి స్థాయి మాస్ మూవీ ఏదీ రాలేదు. ప్రభాస్ మూవీ ‘కల్కి’ సైతం మాస్‌ను పూర్తి స్థాయిలో మెప్పించలేదు.
ఐతే చాలా గ్యాప్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాస్ ప్రేక్షకులనే టార్గెట్ చేసిన రెండు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజవుతున్నాయి. అందులో ఒకటి మాస్ రాజా రవితేజ సినిమా ‘మిస్టర్ బచ్చన్’ కాగా.. మరొకటి రామ్ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘డబుల్ ఇస్మార్ట్’. వీటితో పాటు తంగలాన్, ఆయ్ చిత్రాలు కూడా రిలీజవుతున్నప్పటికీ ప్రధానంగా మాస్ దృష్టి మిగతా రెండు చిత్రాల మీదే ఉంది.
రవితేజ సినిమా అంటేనే మాస్‌కు ఒక విందు భోజనంలా ఉంటుంది. మధ్యలో ఆయన కొంచెం వెరైటీ కోసం ట్రై చేసి దెబ్బ తిన్నారు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ ఆయన మార్కు సినిమాలా కనిపిస్తోంది. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్.. తన ఫేవరెట్ హీరోను అభిమానులు నచ్చేలా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించినట్లున్నాడు. ఈ సినిమా ప్రోమోలు, పాటలు అన్నీ కూడా మాస్‌కు చేరువ అయ్యాయి.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ విషయానికి వస్తే.. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ హిట్‌కు సీక్వెల్. మధ్యలో పూరి మూవీ ‘లైగర్’ తేడా కొట్టినా ‘డబుల్ ఇస్మార్ట్’కు మంచి హైపే క్రియేట్ అయింది. ఈ సినిమా పాటలు.. టీజర్, ట్రైలర్ కూడా మాస్‌ను ఆకర్షించాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ రెండు చిత్రాలూ మంచి ఊపు చూపిస్తున్నాయి. మరి కంటెంట్ కూడా బలంగా ఉంటే మాస్ ప్రేక్షకులు వీటికి బ్రహ్మరథం పట్టడం ఖాయం.
This post was last modified on August 14, 2024 4:14 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…