తెలుగువారి ఓటీటీ ‘ఆహా’లో చాలా వరకు సంప్రదాయబద్ధమైన సినిమాలు, సిరీస్‌లే కనిపిస్తాయి. కొన్ని వయొలెంట్ థ్రిల్లర్స్.. రొమాంటిక్ మూవీస్ రిలీజ్ చేశారు కానీ.. ఫుల్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌లు మాత్రం ఇందులో రిలీజ్ కాలేదు. ఆ విషయంలో నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్స్‌కు.. ఆహాకు పోలికే లేదు.
ఐతే ఇప్పుడు ఆహా కూడా బోల్డ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో తొలిసారిగా ఒక పూర్తి స్థాయి బోల్డ్ మూవీ రిలీజ్ కాబోతోంది. అదే.. ఎవోల్ (Evol). ఈ టైటిల్ చూస్తే అర్థం కానట్లుగా అనిపిస్తుంది. ఐతే ‘Love’ అనే పదాన్ని రివర్స్ చేసి సినిమాకు టైటిల్‌గా పెట్టారన్నమాట. ఈ చిత్రాన్ని సెన్సార్ వాళ్లు థియేటర్లలో రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసిన సినిమా కావడం గమనార్హం. అంత వివాదాస్పదమైన సినిమాను ఆహా వాళ్లు రిలీజ్ చేస్తున్నారు.
‘ఎవోల్’ చిత్రాన్ని రామ్ వెలగపూడి అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. ఇందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడానికి ఆల్ట్ బాలాజీ అనే స్పెషల్ ఓటీటీ ఉంది. మరి దాన్ని సంప్రదించారో లేదో తెలియదు కానీ.. ఊహించని విధంగా ఆహా లాంటి ట్రెడిషనల్ ఇమేజ్ ఉన్న ఓటీటీలో దీన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15 కానుకగా ఈ ‘ఎవోల్’ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు.
రెండు జంటల మధ్య జరిగే కథను బోల్డ్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే. లవ్ అనే టైటిల్‌ను తిరగేశారు అంటే లవ్ తిరగబడి లస్ట్‌గా మారితే ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో. మరి సెన్సార్ బోర్డు బ్యాన్ చేసే స్థాయిలో ఈ ‘ఎవోల్’ మూవీలో బోల్డ్ కంటెంట్ ఏముందో చూడాలి మరి.
This post was last modified on August 13, 2024 6:40 pm
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…