ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజవుతున్న క్రేజీ చిత్రాల్లో ‘తంగలాన్’ ఒకటి. ఈ తమిళ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. దీని టీజర్, ట్రైలర్ చూస్తే పా.రంజిత్ ఏదో భారీ ప్రయత్నమే చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా అతను తీసిన సినిమాలు వేరు.. ఈ చిత్రం వేరు అనిపిస్తోంది.
సరైన సక్సెస్ లేక చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్న విక్రమ్.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే ధీమాతో ఉన్నాడు. అతను సినిమా కోసం పడే కష్టం ఎలాంటిదో తెలుసు. అందులోనూ ఈ చిత్రం కోసం అతను ఎంత శ్రమించాడో ప్రోమోలు చూస్తేనే అర్థమవుతోంది. ఐతే అంతా బాగుంది కానీ.. ఓ వర్గం సోషల్ మీడియాలో ఈ చిత్రం మీద నెగెటివ్ ప్రచారానికి దిగుతోంది. అందుకు ఇటీవలి రాజకీయ పరిణామాలు కారణం.
ఎస్సీ వర్గీకరణకు ఇటీవలే సుప్రీం కోర్టు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఎస్సీల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అందులో దర్శకుడు పా.రంజిత్ కూడా ఒకరు. అతను దర్శకుడు అయినప్పటి నుంచి దళితుల కోసం వాయిస్ వినిపిస్తూనే ఉన్నాడు. తన సినిమాలు కూడా దళితుల మీద అగ్ర కులాల వివక్ష, వారి పోరాటం చుట్టూనే తిరుగుతుంటాయి. బయట కూడా తన భావజాలం ఇందుకు తగ్గట్లే ఉంటుంది.
ఐతే రిజర్వేషన్ల ఫలాలను ఇప్పటికే ఎంతో అనుభవించి ఆర్థికంగా స్థిరపడ్డ వారిని పక్కన పెట్టి.. వెనుకబడ్డ వారికే రిజర్వేషన్లు దక్కేలా వర్గీకరణ చేయాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. అందుకు ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. దీన్ని పా.రంజిత్ లాంటి వాళ్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పును కూడా అతను వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇది మిగతా వారికి నచ్చట్లేదు. అతను దళితులకు మద్దతుగా సినిమాలు తీయడం వరకు పరిమితమైతే సరే కానీ.. వేరే కులాల మీద విషం చిమ్ముతుంటాడంటూ అతణ్ని వ్యతిరేకించేవారి సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఈ క్రమంలోనే తన కొత్త చిత్రం ‘తంగలాన్’ మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఇది అప్రెషన్, డిప్రెషన్ సినిమా అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ నెగెటివిటీ సినిమా మీద ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on August 13, 2024 6:25 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…