గబ్బర్ సింగ్ జ్వరం మొదలైపోయింది

వచ్చే నెల సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇటీవలే మురారి పాత రికార్డులు బద్దలు కొట్టేసి కొత్త బెంచ్ మార్కులు పెట్టేయడంతో వాటిని ఎలాగైనా దాటించాలని ఫిక్సయిపోయారు. దానికి తగ్గట్టే ఇంకా ఇరవై రోజుల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఇరవై నాలుగు గంటల్లోనే ఎక్స్ ప్లాట్ ఫార్మ్ లో 82 వేలకు పైగా ట్వీట్లు పడ్డాయంటే దాని గురించి ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణాలున్నాయి.

పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక అయన కొత్త సినిమా విడుదలయ్యేందుకు బాగా టైం పట్టేలా ఉంది. అటుఇటు 2025 వేసవి దాకా ఎదురు చూడక తప్పేలా లేదు. సో సెలబ్రేషన్ కోసం ఒక మూవీ కావాలి. తమ్ముడు, ఖుషి గత ఏడాది వాడేశారు. సో మిగిలింది గబ్బర్ సింగ్. ఇది కూడా కొన్ని పరిమిత ఏరియాల్లో ఇంతకు ముందు రీ రిలీజ్ అయ్యింది కానీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ స్కేల్ లో చేయలేదు. సో ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నారు. కనివిని ఎరుగని స్థాయిలో ఓపెనింగ్స్ ఇవ్వాలని చూస్తున్నారు. విజయ్ గిల్లి రికార్డులను టార్గెట్ గా పెట్టుకున్నారు.

స్టార్ హీరోలు ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేయడమే గగనంగా మారిపోతున్న టైంలో అభిమానులు రీ రిలీజ్ లనే వేలం వెర్రిగా సంబరాలు చేసుకునేందుకు వాడుకుంటున్నారు. ఓవర్సీస్ లోనూ గబ్బర్ సింగ్ కు భారీ ఎత్తున స్క్రీన్లు దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. నాని సరిపోదా శనివారం ఆగస్ట్ 29న వస్తోంది. కేవలం మూడు రోజుల గ్యాప్ లో గబ్బర్ సింగ్ కి తగినన్ని థియేటర్లు దొరకడం కష్టం. అయినా సరే డిప్యూటీ సీఎం రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి జనసేన, టిడిపికి వర్గాలు కూడా మద్దతు ఇస్తాయి కాబట్టి వసూళ్ల పరంగా సునామి ఖాయంగానే కనిపిస్తోంది.