దర్శకధీర రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారికి కొడుకు కాకుండా బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాధ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొబైల్ వాల్ పేపర్ గా పూరి ఫోటోనే ఉంటుందని పెద్దాయన చెప్పడం కొన్నేళ్ల క్రితం వైరలయ్యింది.
అయితే ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో నిన్న జరిగిన డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి బయట పడింది. ప్రత్యేకంగా అతిథులు లేకుండా క్యాస్ట్ అండ్ క్రూ హాజరైన ఈ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా పూరి ఒక ముచ్చట పంచుకున్నారు.
లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ కు విజయేంద్ర ప్రసాద్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. నీ లాంటి దర్శకులు ఫెయిలవ్వడం తనకు బాధ కలిగిస్తుందని, తర్వాత సినిమా చేయబోయే ముందు కథ ఒక్కసారి తనకు వినిపించమని ఆయన అడిగారు.
ఒకవేళ పొరపాట్లు ఏమైనా ఉంటే రైటర్ గా సలహాలు ఇద్దామని ఆయన ఉద్దేశం. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఇంట్లోనే ఉన్నా తన మీద ఇంత ప్రేమ చూపించిన విజయేంద్ర గారి సలహాకు పూరి కదిలిపోయాడు. డబుల్ ఇస్మార్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసి రుజువు చేయాలని నిర్ణయించుకుని, స్టోరీ ఆయనకు చెప్పకుండానే జాగ్రత్తగా పూర్తి చేశాడు.
ఇదంతా పూరి జగన్నాధ్ స్వయంగా చెప్పడంతో ప్రపంచానికి తెలిసింది. నిజమే మరి. ఒకప్పుడు పోకిరి, ఇడియట్ లాంటి ట్రెండ్ సెట్టర్స్ తో పాటు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ తీసిన పూరి లైగర్ లాంటి బ్యాడ్ కంటెంట్ తో వచ్చినపుడు ఎవరికైనా బాధ కలుగుతుంది.
కానీ టీమ్ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకం బలంగా కనిపిస్తోంది. హీరో రామ్ కు సైతం దీని సక్సెస్ చాలా కీలకం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊర మాస్ కంటెంట్ వచ్చి నెలలు గడిగిపోతున్న తరుణంలో డబుల్ ఇస్మార్ట్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
This post was last modified on August 12, 2024 10:29 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…