ఒకప్పుడు దేవదాసు, సీతయ్య, లాహిరి లాహరి లాహిరి లాంటి బ్లాక్ బస్టర్లిచ్చిన దర్శకుడు వైవిఎస్ చౌదరి ఆ తర్వాత వరస ఫ్లాపులతో ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉన్న సంగతి విదితమే. ఒక్క మగాడు, సలీం, రేయ్ వరసగా దెబ్బ వేయడంతో గ్యాప్ తీసుకున్నారు. 2015 నుంచి డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు. తిరిగి తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగా ఫోన్ పడుతున్న వైవిఎస్ నందమూరి జానకిరామ్ అబ్బాయి నందమూరి తారకరామారావుని లాంఛ్ చేసే బాధ్యతను తీసుకుని ఆ మధ్య ఒక ఈవెంట్ ద్వారా మీడియాకు దానికి సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ఇది జరిగి వారాలైపోయింది.
కట్ చేస్తే వైవిఎస్ చౌదరి ఈ ప్రాజెక్టుని ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఆస్కార్ విజేతలు ఎంఎం కీరవాణిని సంగీత దర్శకుడిగా ఎంచుకోగా, గీత రచన బాధ్యతను చంద్రబోస్ కి అప్పగించారు. కూచిపూడి నృత్యకారిణి, తెలుగమ్మాయి అయిన వీణారావుని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. జానర్ ఏదనేది బయటికి చెప్పడం లేదు కానీ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ట్రెండీ లవ్ స్టోరీ అనే టాక్ అయితే వినిపిస్తోంది. అసలు ఫామ్ లో లేని ఒక దర్శకుడు కంబ్యాక్ చేస్తూ ఇంత బలమైన సెటప్ పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా పట్టుదల గట్టిగానే ఉంది.
ఇప్పటికే ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఉండగా మళ్ళీ అదే పేరుతో ఇంకో మనవడు రావడం గురించి అభిమానులు కొంత అయోమయానికి గురవుతున్నారు కానీ దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తే బెటర్. వైవిఎస్ చౌదరి చేసుకుంటున్న సెటప్ చూస్తే ఖర్చు పరంగా చాలా భారీగానే ఉండబోతోందన్న విషయం అర్థమవుతుంది. ఒకవైపు మోక్షజ్ఞ ఎంట్రీకి వచ్చే నెల రంగం సిద్ధమవుతుండగా ఇటుపక్క కొత్త ఎన్టీఆర్ రంగప్రవేశానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎవరు ముందు వస్తారనేది ఇప్పుడే తేలదు కానీ నందమూరి ఫ్యాన్స్ కు మాత్రం డబుల్ బొనాంజా దక్కబోతోంది.
This post was last modified on August 9, 2024 6:57 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…