కెజిఎఫ్ తర్వాత శాండల్ వుడ్ బడ్జెట్లు బాగా పెరిగిపోయాయి. కాంతార ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది. అలాని ఫలితాలు రిపీట్ కావడం లేదు. కబ్జా లాంటి మల్టీస్టారర్ వాతలు పడుతూనే ఉన్నాయి. ఆ మధ్య పొగరు అనే డబ్బింగ్ సినిమాలో రష్మిక మందన్న వెంటపడిన భారీ కాయం హీరో ధృవ సర్జ గుర్తున్నాడా. ఇతను మార్టిన్ అనే ప్యాన్ వరల్డ్ మూవీ చేశారు. 12 భాషల్లో వరల్డ్ వైడ్ అక్టోబర్ 11 విడుదల చేయబోతున్నారు. సూర్య కంగువ పండగ బరిలో ఉన్న సంగతి తెలిసీ పోటీకి సిద్దపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవలే ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ట్రైలర్ లాంచ్ చేశారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఏదో క్రియేటివ్ గా చేద్దామనుకుని నిర్మాతలు వేసిన ఒక ఐడియా బోల్తా కొట్టి ట్రోలింగ్ కి దారి తీసింది. వివిధ బాషల నుంచి వచ్చిన జర్నలిస్టులను ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చే క్రమంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన థియేటర్లో ఒక పెద్ద స్పీకర్ ద్వారా ముందే రికార్డు చేయించిన హీరో వాయిస్ లో చెవులు చిల్లులు పడేలా ఆర్డర్లు ఇవ్వడం వచ్చినవాళ్ళను చికాకు పెట్టించింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ అంటూ ఇలా బాషల వారిగా వేర్వేరుగా అడిగేలా చేసి మరింత అసహనం కలిగించారు. ఒకదశలో ధృవకే ఇదంతా చికాకు పెట్టడం గమనించవచ్చు.
ఒక కండలు తిరిగిన భారతీయుడు పాకిస్థాన్ వెళ్లి అక్కడ అరాచకం సృష్టించడమనే పాయింట్ మీద ఈ మార్టిన్ రూపొందింది. యాక్షన్ కింగ్ అర్జున్ దీనికి కథను సమకూర్చడమే కాక స్వయంగా ప్రమోషన్ల బాధ్యతలు చూసుకుంటున్నాడు. ధృవ ఆయనకు మేనల్లుడు కావడం ప్రధాన కారణం. ట్రైలర్ లో కంటెంట్ కూడా అచ్చం కబ్జాలా ఉందంటూ అప్పుడే నెటిజెన్లు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. నిజానికీ మార్టిన్ నెలల క్రితమే సిద్ధమైనప్పటికీ వివిధ కారణాల వల్ల ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా సూర్య కంగువని ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on August 8, 2024 12:21 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…