గత నెల జూలై 12న విడుదలై భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న భారతీయుడు 2 కథ ఇంకా అయిపోలేదు. థియేట్రికల్ రన్ ముగిసిపోయి అభిమానులు మర్చిపోయే పనిలో ఉన్నారు కానీ నిర్మాతలకు మాత్రం ఇంకా దీని తాలూకు తలనెప్పులు తగ్గిపోలేదు. సరే బొమ్మ పోతే పోయింది ఓటిటిలో చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు గట్టిగానే ఉన్నారు.
అయితే వాళ్ళ ఆశలు అంత సులభంగా నెరవేరేలా లేవని డిజిటల్ వర్గాల కథనం. ఇండియన్ 2 హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఒప్పందం చేసుకుంది. సుమారు 120 కోట్ల దాకా ఇచ్చేందుకు రిలీజ్ కు ముందు అగ్రిమెంట్ జరిగిందట.
తీరా చూస్తే ఇంత ఘోరంగా ఇండియన్ 2 డిజాస్టర్ కావడం చూసి షాక్ తిన్న నెట్ ఫ్లిక్స్ సంస్థ చెల్లించడానికి ఒప్పుకున్న సొమ్ములో ఇప్పుడు కోత పెట్టే ప్రతిపాదన పెట్టిందని సమాచారం. దానికి ఒప్పుకుంటేనే ఇండియన్ 3కి సంబంధించిన డీల్ మాట్లాడుకుందామని చెప్పడంతో షాక్ తిన్న నిర్మాణ సంస్థ ఇప్పుడేం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుందని వినికిడి.
ఎందుకంటే ఖర్చు పెట్టిన బడ్జెట్ కి, వచ్చిన థియేటర్ రెవిన్యూకి ఎక్కడా పొంతన లేదు. పైగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి నష్టాల నివారణకు ఏదైనా చర్య తీసుకోమని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదింకా సెటిల్ చేయాల్సి ఉంది.
ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడటంతో భారతీయుడు 2 తాతయ్యని ఓటిటిలో చూస్తామా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదే తరహాలో రజనీకాంత్ లాల్ సలామ్, టైగర్ శ్రోఫ్ గణపథ్ లు సైతం నెట్ ఫ్లిక్స్ గడప దగ్గరే ఆగిపోయాయి.
కారణాలు ఇవేనా కాదానేది పక్కన పెడితే సదరు ఓటిటి సంస్థ ఫలితాల విషయంలో ఎంత కఠినంగా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. తీసికట్టు కంటెంట్ మొహాన కొడితే వందల కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా లేమని తేల్చి చెబుతోంది. 2025 వేసవికి ప్లాన్ చేసుకున్న భారతీయుడు 3 బిజినెస్ మీద ఇదంతా తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.
This post was last modified on August 1, 2024 11:41 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…