పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోల్డ్‌లో పెట్టిన మూడు చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఐతే పవన్ మళ్లీ అందుబాటులోకి వస్తే.. ఆయన ప్రయారిటీ లిస్ట్‌లో ఇదే చివరన ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. కొందరేమో ఈ సినిమా ముందుకు కదలడం కష్టమని.. మధ్యలో ఆపేస్తారని కూడా అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారం గురించి ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ ప్రెస్ మీట్లో దర్శకుడు హరీష్ శంకర్‌ను అడిగితే.. సమాధానం దాటవేశాడు. ఫ్యాన్స్ గురించి ప్రస్తావిస్తే నేను వాళ్లతోనే మాట్లాడుకుంటాను అనేశాడు.
ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ ఈ చిత్రం గురించి మాట్లాడాడు. పవన్ కోసం ఎదురు చూస్తున్నామని.. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని చెప్పిన హరీష్.. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులు గుర్తుంచుకునేలా ఉంటుందని వ్యాఖ్యానించాడు.
“పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇంతకుముందు క్యాసెట్లు, డీవీడీలు దాచుకునేవాళ్లం కదా. అలా లైబ్రరీలో దాచుకునే సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏం ఆశించి థియేటర్లకు వస్తారో అవన్నీ సంపూర్ణంగా ఉండే సినిమా. ఫ్యాన్స్ రిపీట్స్‌లో ఈ సినిమ ా చూస్తారు” అని హరీష్ తెలిపాడు.
ఈ సినిమా చాలా ఆలస్యం కావడం, తన కెరీర్లో విలువైన కొన్నేళ్లు వేస్ట్ అయిపోవడం గురించి ప్రస్తావించగా.. “ముందు నా కెరీర్లో గ్యాప్ రావడానికి కరోనా కారణం. దాని వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల నా సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ఇందులో రాజకీయాలు ఉన్నాయని నేను అనుకోను. పవన్ గారిని మరో దర్శకుడు మెప్పించి తన చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాడంటే అది అతడి ప్రతిభ. అంతే తప్ప నేను ఎవరినీ నిందించను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆలస్యం కావడంతో నేను ‘మిస్టర్ బచ్చన్’ మొదలుపెట్టి ఏడు నెలల్లో పూర్తి చేశా. నా కెరీర్లోనే అత్యంత వేగంగా తీసిన సినిమా ఇది. ఇక ముందు మరింత వేగంగా మూవీస్ చేస్తా” అని హరీష్ అన్నాడు.
This post was last modified on July 30, 2024 1:51 pm
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…