Movie News

స్టార్ హీరోల లక్కీ హ్యాండ్ SJ సూర్య

మహేష్ బాబు స్పైడర్ ని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేకపోవడానికి కారణం వాళ్ళ అంచనాలు నిలువునా నీరుగార్చిన మురుగదాస్ దర్శకత్వమే. కానీ అది ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ఆ సినిమా వల్ల విపరీతంగా లాభపడింది మాత్రం విలన్ గా నటించిన ఎస్జె సూర్య. సైకో కిల్లర్ గా అతని నటన చాలా పేరు తీసుకొచ్చింది. తర్వాత యాక్టర్ గా చాలా బిజీగా మారిపోయాడు. లక్షల రెమ్యునరేషన్ తో మొదలుపెట్టి ఇప్పుడు పది కోట్ల దాకా పలుకుతున్నాడని చెన్నై టాక్. ఒక వెరైటీ సెంటిమెంట్ ఇతన్ని స్టార్ హీరోలు లక్కీ హ్యాండ్ లా ఫీలయ్యేలా చేస్తోంది. అదెలాగో చూద్దాం.

ఎస్జె సూర్య మొదటిసారి జట్టుకట్టిన ప్రతి స్టార్ హీరోకి వాళ్ళ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్లు దక్కాయి. విజయ్ అదిరింది పాత రికార్డులు బద్దలు కొట్టగా శివకార్తికేయన్ కాలేజీ డాన్ విజయం మార్కెట్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. శింబు మానాడు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. మార్క్ ఆంటోనీ తమిళ బ్లాక్ బస్టర్ సక్సెస్ వెనుక కీలక పాత్ర పోషించింది ఎస్జె సూర్యనే. ఏకంగా విశాల్ నే డామినేట్ చేశాడు. లారెన్స్ ని తిరిగి నిలబెట్టిన జిగర్ తండా డబుల్ ఎక్స్ లో ఈయన క్యారెక్టర్ ని మర్చిపోలేం. ఇక తాజాగా రాయన్ లో ధనుష్ కి ప్రతినాయకుడిగా కనిపించి మరో వంద కోట్ల గ్రాసర్ ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడీ ఎస్జె సూర్య రెండు కీలక తెలుగు ప్యాన్ ఇండియా సినిమాల్లో భాగమయ్యాడు. మొదటిది ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న నాని సరిపోదా శనివారం. ఇందులో వీళ్లిద్దరి క్లాష్ ఓ రేంజ్ లో ఉండబోతోందనే క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది. రెండోది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్. డిసెంబర్ లో వస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఎస్కె సూర్యకు చాలా ప్రాధాన్యం దక్కిందనే రీతిలో లీకులు వస్తున్నాయి. ఇదేదో పాజిటివ్ సెంటిమెంట్ బాగుంది కదా. అలాని తనకు ఫ్లాపులు లేవని కాదు. ఇటీవలే భారతీయుడు 2 షాక్ ఇచ్చింది. కాకపోతే అధిక శాతం హిట్లే ఉన్నాయి కాబట్టి ఎస్జె సూర్య డిమాండ్ మాములుగా లేదు.

This post was last modified on July 30, 2024 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago