2024 అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ జపాన్ దేశంలో అడుగు పెట్టబోతున్నాడు. అక్టోబర్ 4 జపాన్ సబ్ టైటిల్స్ తో ఒరిజినల్ వెర్షన్ ని స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. మన దేవుడికి సంబంధించిన కథను అక్కడ చూస్తారానే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఇండియన్ మైథలాజిని ఆ దేశం వాళ్ళు బాగా ఫాలో అవుతారు. పూజించకపోయినా ఇక్కడి దైవత్వం మీద అపారమైన గౌరవం ఉంది. సో హనుమాన్ కనెక్ట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. వేలాది స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ జపాన్ దేశంలో సునామి వసూళ్లను తీసుకొచ్చాక ఇతర ప్యాన్ ఇండియా సినిమాలకు స్ఫూర్తి వచ్చింది. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న హనుమాన్ లాంటివి ఆలస్యం చేయకుండా ఏడాది లోపే రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ట్రిపులార్ జపాన్ లో ఏకధాటిగా వంద రోజులకు పైగా ఆడింది. తర్వాత సింగల్ స్క్రీన్లు, షిఫ్టింగులు లెక్కబెట్టుకుంటూ వెళ్తే ఏడాదికి పైగా రన్ దక్కిందని అక్కడి బయ్యర్లు చెబుతున్న మాట. ఈ లెక్కన హనుమాన్ కనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇప్పటిదాకా ఉన్న మూడు వందల కోట్ల వసూళ్ల లెక్కకు మరింత భారీ మొత్తం తోడవుతుంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఇలాంటి వరల్డ్ వైడ్ రిలీజ్ ఇమేజ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. రాజమౌళికి ఎలాగైతే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందో హనుమాన్ ద్వారా తానూ సాధించుకోవడానికి అవకాశం దక్కుతుంది. జపాన్ లో ఓటిటి ద్వారా హనుమాన్ చూడలేదా అనే డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ పైరసీలు, ప్రభుత్వ అనుమతి లేని ఓటిటిలు, స్ట్రీమింగులు ఉండవు. ముత్తు, సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్, ఆర్ఆర్ఆర్, బాహుబలి, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లు సృష్టించిన రికార్డుల్లో హనుమాన్ ఏవేవి దాటబోతోందో చూడాలి. ఇంకో రెండు నెలల్లో అది కూడా తేలిపోతుంది.
This post was last modified on July 27, 2024 6:49 pm
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…