హీరో దర్శకుడు ఇద్దరూ చెరో డిజాస్టర్ తర్వాత చేతులు కలిపినప్పుడు ఆ ప్రాజెక్టు మీద సహజంగానే బజ్ తగ్గుతుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో అలాంటి సూచనలు లేవు. మిస్టర్ బచ్చన్, తంగలాన్ తో పాటు బాలీవుడ్ లో స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదా రూపంలో తీవ్రమైన పోటీ ఉన్నా సరే క్రేజ్ పరంగా అందరికంటే ఒక అడుగు ముందు ఉండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులను సుమారు 60 కోట్లకు విక్రయించగా ఓటిటిని అమెజాన్ ప్రైమ్ 33 కోట్లకు కొనుగోలు చేసిందన్న వార్త అభిమానులలకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇక ఆడియో, హిందీ డబ్బింగ్ శాటిలైట్, డిజిటల్ కలిపి మరో 50 కోట్ల దాకా రావొచ్చనే అంచనా నిజమైనా ఆశ్చర్యం లేదు. ఇంత భారీ మొత్తంలో ఆఫర్లు రావడం చూస్తే ఇస్మార్ట్ శంకర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఆగస్ట్ మొదటివారంలోనే సెన్సార్ లాంఛనం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్, మీడియా ఇంటర్వ్యూలు వగైరా బోలెడు కవర్ చేయాల్సి ఉంటుంది. చేతిలో ఉన్నదేమో కేవలం 18 రోజులు. అయితే ఆందోళన చెందడానికి ఏమి లేదు. అన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగిపోతున్నాయి.
ఇప్పటిదాకా వచ్చిన పాటలు, ప్రోమోలు హైప్ కి సరిపోయేలా ఉన్నాయి. వాటిని మరింత పెంచే బాధ్యతను ట్రయిలర్ తీసుకోబోతోంది. దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. హిందీ మార్కెట్ లోనూ దీనికి పబ్లిసిటీ వచ్చేలా నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ బృందం ముంబై టీమ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. డబుల్ ఇస్మార్ట్ విజయం మీద పూరి జగన్నాథ్ తర్వాతి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. తల్వార్ పేరుతో ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధంగా ఉందట. సాలిడ్ కంబ్యాక్ ఖచ్చితంగా చేస్తాననే నమ్మకం సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆగస్ట్ 15 దాకా వెయిట్ చేయాలి.
This post was last modified on July 27, 2024 10:11 pm
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…