పదిహేను సంవత్సరాల క్రితం పరిశ్రమకు వచ్చిన సందీప్ కిషన్ మధ్యలో హిట్లు పడుతున్నా కెరీర్ సరైన క్రమంలో ఒక మార్కెట్ దిశగా వెళ్లలేకపోయింది. అందుకే సబ్జెక్టులు ఎంత వైవిధ్యంగా ఎంచుకున్నా సక్సెస్ మాత్రం పుష్కరానికోసారి పలకరించేది. కానీ ఈసారి లెక్కలు మారుతున్నట్టు కనిపిస్తోంది. ఊరు పేరు భైరవకోనతో చెప్పుకోదగ్గ విజయన్ని ఖాతాలో వేసుకున్న ఈ యూత్ హీరో ధనుష్ దృష్టిలో పడ్డం వల్ల ఒకే ఏడాది రెండు తమిళ సినిమాల్లో ఛాన్స్ కొట్టేశాడు. కెప్టెన్ మిల్లర్ తెలుగులో ఆడలేదు కానీ తమిళంలో డీసెంట్ గా వర్కౌట్ చేసుకుంది. ఆ సెట్లోనే ధనుష్ పరిచయం రాయన్ ఆఫర్ ఇచ్చేలా చేసింది.
కట్ చేస్తే రాయన్ లో సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడుతున్నాయి. ఊరికే ఆవేశంతో ఊగిపోతూ పరిణామాలు ఆలోచించకుండా ముందు వెనుక చూసుకోకుండా దాడులకు తెగబడే తమ్ముడిగా తన నటన మీద బాగానే ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఓవర్ సీరియస్ గా ఉన్న ధనుష్ కన్నా నవ్విస్తూ, మురిపిస్తూ, లవ్ చేసే మాస్ టచ్ ఉన్న సందీప్ కిషన్ క్యారెక్టర్ నే జనాలు ఇష్టపడ్డారు. అపర్ణ బాలమురళితో లవ్ ట్రాక్ కూడా బాగానే పండింది. అయితే తనకు ఇది మొదటి కోలీవుడ్ సక్సెస్ కాదు. సూపర్ హిట్స్ ఖాతాలో ఆల్రెడీ మానగరం, మాయావన్ ఉన్నాయి.
కాకపోతే రాయన్ అక్కడి ఆఫర్లకు మంచి ప్రమోషన్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మజాకా ( పరిశీలనలో ఉన్న టైటిల్) చేస్తున్న సందీప్ కిషన్ దీని ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ అవుతాననే నమ్మకంతో ఉన్నాడు. రావు రమేష్ కాంబోలో వచ్చే ఎపిసోడ్స్ హిలేరియస్ గా ఉంటాయట. మాస్ అంశాలు కూడా గట్టిగా ప్లాన్ చేశారని సమాచారం. క్రమంగా తెలుగులో చేసే సినిమాలు డబ్బింగ్ ద్వారా అయినా తమిళంలో కూడా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న మాయావన్ 2తో అది మరింత బలపడుతుందని ధీమాగా ఉన్నాడు.
This post was last modified on July 27, 2024 7:06 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…