గత ఏడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ మీద కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో చూశాం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వాటికి ధీటైన సమాధానం చెప్పి నోళ్లు మూయించాడు కానీ ఇంకెవరైనా వివాదాలొద్దనుకునే డైరెక్టరైతే అన్నీ మౌనంగా భరించేవాడు. ముఖ్యంగా రన్బీర్ కపూర్ క్యారెక్టరైజేషన్, మహిళలను చూపించిన తీరు, హింస పట్ల కామెంట్లు చేసిన వాళ్ళు ఎందరో. కన్నకొడుకు మీర్జాపూర్ లాంటి బోల్డ్ వయొలెంట్ సిరీస్ నిర్మించినప్పుడు మౌనంగా ఉన్న ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ యానిమల్ మీద మాత్రం విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఇదంతా గతం.
అసలు విషయానికి వస్తే మొన్న విడుదలైన బ్యాడ్ న్యూజ్ బాగానే వసూళ్లు రాబడుతోంది. యానిమల్ లో నటించిన త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్ర పోషించగా విక్కీ కౌశల్ హీరోగా నటించాడు. ఒక అమ్మాయి ఇద్దరు మగాళ్లతో వేర్వేరుగా పడక పంచుకుని, వాళ్ళ ద్వారా గర్భం దాల్చి, కడుపులో ఉన్న బిడ్డకు తండ్రెవరో కనిపెట్టేందుకు విచిత్రమైన పరీక్షలు పెట్టే కాన్సెప్ట్ తో ఇది రూపొందింది. సభ్య సమాజం ఏ మాత్రం అంగీకరించే అంశం కాని ఈ బ్యాడ్ న్యూజ్ గురించి యానిమల్ మీద సెటైర్లు వేసిన వాళ్ళు ఎవరూ నోరు విప్పడం లేదు. కామెడీ పేరుతో అయినా ఇంత దిగజారుడు థీమ్ ఏంటనేదే ప్రశ్న.
అప్పుడు లేచిన నోళ్ళన్నీ ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉన్నాయంటే సమాధానం రాదు. వినోదం కోసం ఆ మాత్రం ఫ్రీడమ్ తీసుకోవడం తప్పేమి కాదనే గొప్ప లాజిక్ చెబుతున్న వాళ్ళు లేకపోలేదు. వివాహ బంధాన్ని, మాతృత్వాన్ని ఎగతాళి చేసే ఇలాంటి బ్యాడ్ న్యూజ్ లను మహా గుడ్ గా తీసుకుని పొగడ్తల వర్షం కురిపిస్తున్న బ్యాచ్ ఆన్ లైన్ లో కనిపిస్తోంది. కలెక్షన్ల పరంగా హిట్టు అనిపించుకోవచ్చేమో కానీ ఇది మాత్రం ఆలోచించాల్సిన విషయమే. కల్కి 2898 ఏడి తర్వాత హిందీలో చెప్పుకోదగ్గ సినిమా ఇదొక్కటే కావడంతో వీకెండ్ నెంబర్లు బాగున్నాయి. లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 21, 2024 4:39 pm
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…