ఏదైనా మీడియా మైకు ముందు నోరు జారడం తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవడానికి కిందా మీద పడటం కొందరు సీనియర్ నటులకు అలవాటుగా మారింది. ఆ మధ్య త్రిష మీద మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూశాం. తాజాగా తమన్నా మీద అలాంటి కామెంట్స్ చేసి పార్తీబన్ హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి ఆడియన్స్ కేవలం డాన్సు కోసమే సినిమా చూస్తున్నారని, తమన్నా ఉంటే చాలు బొమ్మ హిట్టయిపోతుందని అనేశారు. ఇది రజనీకాంత్ జైలర్ గురించేనని కొందరు భావించి సోషల్ మీడియాలో భగ్గుమన్నారు.
ఇది దూరం వెళ్తోందని గుర్తించిన పార్తీబన్ తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని, ఎవరినీ చులకన చేసే ఉద్దేశం తనకు లేదని సారీ చెప్పాడు. గతంలో ఇదే తమన్నా నటించిన రామ్ చరణ్ రచ్చలో ఈయన హీరో తండ్రిగా కాసేపు క్యామియో చేయడం గుర్తేగా. ఇటీవలే భారతీయుడు 2తో తన టీన్జ్ అనే పిల్లల హారర్ సినిమాని విడుదల చేశాడు పార్తీబన్. దానికంటే బెటర్ గా ఉందనే టాక్ వచ్చింది కానీ బాగుందనే మాట ప్రేక్షకుల నుంచి రాబట్టుకోలేదు. ఫెయిల్యూర్ గానే నిలిచింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తమన్నా పేరుని వాడటం, అది కాస్తా వైరల్ కావడం జరిగిపోయాయి.
ఆయన సంగతి కాసేపు పక్కనపెడితే తమన్నా స్పెషల్ సాంగ్స్ కు చాలా ప్లస్ అవుతోందన్న మాట వాస్తవమే. జైలర్ అనే కాదు గతంలో జై లవకుశ, సరిలేరు నీకెవ్వరుతో పాటు త్వరలో విడుదల కాబోయే బాలీవుడ్ మూవీ స్త్రీ 2లోనూ ప్రత్యేక గీతాల్లో ఆడిపాడింది. ఇది దృష్టిలో ఉంచుకునే పార్తీబన్ అలా అన్నారో ఏమో కానీ మొత్తానికి పెద్దాయన అలోచించి మాట్లాడాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తారని పేరున్న ఈ సీనియర్ మోస్ట్ నటుడు ఏదో ఫ్లోలో అనేసిన మాట దూరం వెళ్లిపోయింది. అందుకే ఇంటర్ నెట్ యుగంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
This post was last modified on July 20, 2024 5:20 pm
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…