గత ఏడాది దసరా, హాయ్ నాన్న రూపంలో రెండు ఘనవిజయాలు సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని వచ్చే నెల ఆగస్ట్ 29న సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కథల ఎంపికలో విలక్షణ శైలి పాటిస్తూ క్లాసు, మాసుని బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్న నాని మరోసారి వివేక్ ఆత్రేయతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. వీళ్ళ కలయికలో వచ్చిన అంటే సుందరానికి కమర్షియల్ గా అద్భుతాలు చేయనప్పటికీ కంటెంట్ ప్రశంసలు దక్కించుకుంది. ఇవాళ విలన్ గా నటించిన ఎస్జె సూర్య పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ టీజర్ ని విడుదల చేసింది నిర్మాణ సంస్థ డివివి.
కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన క్లూని ఇందులో రివీల్ చేశారు. అనగనగా నరకాసురుడు లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ (ఎస్జె సూర్య). ఖాకీ దుస్తులు ధరించిన దుర్మార్గుడు. దొరికినవాడు అమాయకుడైనా సరే నరకం చూపించే దాకా వదిలిపెట్టడు. అధికారం మాటున అరాచకం చేస్తున్న ఇతన్ని అడ్డుకునేందుకు సూర్య (నాని) రూపంలో శ్రీకృష్ణుడు, కానిస్టేబుల్ వేషంలో సత్యభామ (ప్రియాంక మోహన్) లు రంగంలోకి దిగుతారు. రక్తం తాగే ఆ కరుడు గట్టిన కిరాతకుడిని సూర్య ఎలా ఎదురుకున్నాడు, అది కూడా ఒక్క శనివారం మాత్రమే కోపం వచ్చే తన లక్షణాన్ని ఎలా వాడుకున్నాడనేది తెరమీద చూడాలి.
టీజర్లు చూస్తుంటే వివేక్ ఆత్రేయ ఏదో ఊహించని డిఫరెంట్ పాయింట్ తోనే సరిపోదా శనివారం తెరకెక్కించి నట్టు కనిపిస్తోంది. మాస్ టచ్ చూపిస్తూనే స్టయిలిష్ యాక్షన్ ని జొప్పించి తీరు కొత్తగా అనిపిస్తోంది. నాని తనదైన టైమింగ్ తో ఎప్పటిలాగే అదరగొడతాడు కానీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కి దూరంగా చేసిన ఈ ప్రయత్నం అభిమనులకు చాలా స్పెషల్ గా ఉండిపోనుంది. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ థ్రిల్లర్ పెద్ద బడ్జెట్ తోనే రూపొందింది. ఫిలింఫేర్, సైమా అవార్డుల్లో ఆధిపత్యం ప్రదర్శించిన నాని మరోసారి అవార్డు విన్నింగ్ కంటెంట్ తోనే వస్తున్నాడు. చూద్దాం.
This post was last modified on July 20, 2024 11:39 am
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…