Movie News

ఆ సంస్థకు శంకర్ శాపం

లైకా ప్రొడక్షన్స్.. ఇండియాలోనే అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటి. 2.0 లాంటి మెగా బడ్జెట్ మూవీ నిర్మాణంతో అప్పట్లో ఆ సంస్థ పేరు మార్మోగింది. తమిళంలో మరిన్ని పెద్ద, మిడ్ రేంజ్ సినిమాలను ఆ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఐతే సినిమాల స్కేల్, క్వాంటిటీ పరంగా లైకా స్థాయి పెద్దదే. కానీ ఆ సంస్థ సక్సెస్ రేట్ మాత్రం ఏమంత గొప్పగా లేదు.

‘కత్తి’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో మొదలైన ఆ సంస్థ.. ఆ తర్వాత చాలా పరాజయాలు ఎదుర్కొంది. ముఖ్యంగా అగ్ర దర్శకుడు శంకర్ లైకాను కొట్టిన దెబ్బలు అలాంటిలాంటివి కావు. 2018లో ఆ సమయానికి ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్లో ‘2.0’ను ప్రొడ్యూస్ చేసింది లైకా.

ఐతే ఆ ఖర్చుకు తగ్గ ఫలితాన్ని సినిమా రాబట్టలేకపోయింది. ఓపెనింగ్స్ బాగా వచ్చినా.. లాంగ్ రన్ లేకపోవడంతో పెట్టుబడి వెనక్కి రాలేదు. అప్పట్లోనే దాని బడ్జెట్ రూ.550 కోట్లని చెప్పుకున్నారు. లైకాకు ఆ సినిమా వల్ల వచ్చిన నష్టం వంద కోట్లకు తక్కువ ఉండదని అంచనా వేశారు. ఇక గత కొన్నేళ్లలో దర్బార్, చంద్రముఖి-2, పొన్నియన్ సెల్వన్, లాల్ సలామ్ లాంటి చిత్రాలతో చేదు అనుభవాలు ఎదుర్కొంది లైకా.

లేటెస్ట్‌గా ‘లైకా’ను ‘భారతీయుడు-2’ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది. ‘2.0’తో చేదు అనుభవం ఎదుర్కొన్నప్పటికీ శంకర్‌ను నమ్మి మరోసారి భారీ బడ్జెట్‌తో ‘భారతీయుడు-2’ మొదలుపెట్టాడు లైకా అధినేత సుభాస్కరన్. కానీ షూటింగ్ బాగా ఆలస్యమైంది. బడ్జెట్ పెరిగింది.

అది చాలదన్నట్లు క్రేన్ ప్రమాదం, కరోనా కారణంగా సినిమా రెండేళ్లు ఆగిపోయింది. తిరిగి గత ఏడాది చిత్రీకరణ పున:ప్రారంభమైంది. ఐతే బడ్జెట్ బాగా ఎక్కువైపోయిందని సినిమాను రెండు భాగాలు చేయాలనుకున్నారు. అలాగే కానిచ్చారు. తీరా చూస్తే 2 పార్ట్స్ ఆలోచన దారుణంగా బెడిసికొట్టింది.

‘భారతీయుడు-2’ డిజాస్టర్‌గా మిగిలింది. దీని మీద వచ్చిన థియేట్రికల్ ఆదాయం సినిమా మీద పెట్టిన బడ్జెట్లో పదో వంతు కూడా లేకపోవడం గమనార్హం. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ‘భారతీయుడు-3’ మీద ఆశలు లేకుండా పోయాయి. దాన్నుంచి వచ్చే ఆదాయం కూడా నామమాత్రమే కావచ్చు.

దీంతో ‘ఇండియన్-2’ మీద పెట్టిన పెట్టుబడి చాలా వరకు బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నట్లే. మొత్తానికి 2.0, ఇండియన్ సీక్వెల్ సినిమాలతో శంకర్ లైకా వాళ్ల కొంప ముంచినట్లే కనిపిస్తున్నాడు.

This post was last modified on July 18, 2024 9:44 am

Share

Recent Posts

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

28 minutes ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

2 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

3 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

3 hours ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

3 hours ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

3 hours ago