Movie News

దేవరతో పోటీకి సై అంటున్న కార్తీ

సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1కి ఇప్పటిదాకా పోటీ లేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీని హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు అప్పుడే సింగల్ స్క్రీన్లను బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఏరియాల వారీగా మొదలైపోయింది. ముందు అనుకున్న అక్టోబర్ 10 కాకుండా రెండు వారాలు ముందే రావడం పట్ల అభిమానులు హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడితో ట్విస్టు అయిపోలేదు.

తారక్ తో పోటీ పడేందుకు కార్తీ సిద్ధమంటున్నాడు. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన మెయ్యజగన్ సెప్టెంబర్ 27 రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ సమాంతరంగా రిలీజవుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీ తెలంగాణలో దీని వల్ల దేవరకు ఎలాంటి సమస్య రాదు. కానీ తమిళనాడులో కార్తీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కేరళలోనూ ఆ అవకాశాన్ని కొట్టి పారేయలేం. అరవింద్ స్వామి మరో కీలక పాత్ర పోషించిన ఈ విలేజ్ డ్రామాలో శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. గోవింద్ వసంత్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదే టీమ్ శర్వానంద్ 96 తీసింది.

ఇంతేనా అనుకోకండి. జయం రవి బ్రదర్, కెవిన్ బ్లడీ బెగ్గర్ కూడా అదే డేట్ కోసం చూస్తున్నాయి.. ఇదే జరిగితే అన్ని భాషల్లో మంచి రిలీజ్ దక్కించుకోవాలని చూస్తున్న దేవరకు ముఖ్యంగా తమిళంలో ఇబ్బందులు తప్పవు. షూటింగ్ ఇంకా కొంచెం బ్యాలన్స్ ఉండటంతో అనుకున్న టైంకి జూనియర్ వస్తాడా లేదా అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బృందం మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టి పారేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 27 దేవర రావడం ఫిక్సే. తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో సోలోగా బరిలో దిగడం మాత్రం సాధ్యపడేలా కనిపించడం లేదు.

Satya

Recent Posts

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

2 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

2 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

3 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

3 hours ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

3 hours ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

3 hours ago