ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ఒకే టైటిల్ తో రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లో రావడం అరుదు. వాటి ఫలితాలు రివర్స్ లో ఎదురవ్వడం కూడా అనూహ్యమే. అలాంటిదే ఈ ఉదంతం. గత నెలాఖరున అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ మహరాజ్ ని బోలెడు వివాదాలు, కోర్టు కేసుల తర్వాత నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. దశాబ్దాల క్రితం జరిగిన ఒక దొంగ స్వామి వివాదాస్పద అంశాన్ని తీసుకుని రూపొందించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులను మెప్పించలేదు.
ఫలితంగా కోట్ల రూపాయలు కుమ్మరించిన నెట్ ఫ్లిక్స్ కు ఓ మోస్తరు వ్యూస్ అయితే దక్కాయి కానీ మహరాజ్ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. కొడుక్కి డ్రీం ఇంట్రో అవుతుందని ఆశపడ్డ అమీర్ ఖాన్ ఆశా నెరవేరలేదు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి మహారాజ ఇటీవలే ఓటిటిలో వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ సాధించి వంద కోట్ల గ్రాస్ ని దాటేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి పెద్ద హీరోలతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ వెచ్చించిన మొత్తం తక్కువే. కానీ కేవలం అయిదు రోజులకే రికార్డు వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. తెలుగుతో సహా అయిదు భాషల్లో స్ట్రీమింగ్ చేయడం ప్లస్ అయ్యింది.
సో ఈ లెక్కన ఒక మహరాజ్ ముంచితే ఇంకో మహారాజ నిలబెట్టాడు. సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి సినిమాకు సంబంధించి బోలెడు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. షాకింగ్ కంటెంట్, ఊహించని మలుపులతో దర్శకుడు తీసిన విధానాన్ని థియేటర్ లో మిస్ అయినవాళ్లు మెచ్చుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ సైతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి స్పెషల్ ప్రమోషన్లు చేస్తోంది. కనీసం రెండు మూడు వారాల పాటు టాప్ 1 ఇండియన్ మూవీగా నిలిచే అవకాశాలను అంచనా వేస్తోంది. దీని దెబ్బకు మక్కల్ సెల్వన్ రాబోయే సినిమాల డిజిటల్ హక్కులకు డిమాండ్ పెరుగుతుందని వేరే చెప్పాలా.
This post was last modified on July 17, 2024 6:44 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…