Movie News

భార‌తీయుడిని వదిలేసిన శంక‌ర్

ఈ రోజుల్లో సినిమాను రిలీజ్ చేశాం.. త‌మ ప‌నైపోయింద‌ని హీరో, ద‌ర్శ‌కుడు అనుకుంటే క‌ష్టం. విడుద‌ల త‌ర్వాత కూడా సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయాలి. ప్ర‌మోష‌న్లు కొన‌సాగించి వ‌సూళ్లు పెంచ‌డానికి ట్రై చేయాలి. కానీ రిలీజ్ త‌ర్వాత ప్ర‌మోష‌న్లు కొన్ని సినిమాల‌కే క‌లిసి వ‌స్తాయి. కొన్ని చిత్రాల‌కు ఏం చేసినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అలాంటి చిత్రాల‌ను హీరోలు, దర్శ‌కులు ప‌ట్టించుకోవ‌డం మానేసి త‌మ ప‌నిలో ప‌డిపోతారు. ఇప్పుడు లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంకర్ అదే ప‌ని చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

విడుద‌ల ముంగిట భార‌తీయుడు-2ను వీళ్లిద్ద‌రూ ఎంత బ‌లంగా ప్ర‌మోట్ చేశారో తెలిసిందే. తెలుగులోనూ పెద్ద ఈవెంట్లో పాల్గొన్నారు. త‌ర్వాత మీడియాను మీట‌య్యారు. కానీ రిలీజ్ త‌ర్వాత అటు త‌మిళంలో కానీ, ఇటు తెలుగులో కానీ ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేవు.

శంక‌ర్ అయితే విడుద‌లైన మూడో రోజుకే ఇండియ‌న్-2 సంగ‌తి ప‌క్క‌న పెట్టేసి హైద‌రాబాద్ వ‌చ్చేశాడ‌ని స‌మాచారం. ఆయ‌న త‌న త‌ర్వాతి చిత్రం గేమ్ చేంజ‌ర్ మీద ఫోక‌స్ చేస్తున్నార‌ట‌. మిగిలిన 10-15 రోజుల షూట్ కోసం ఆయ‌న ప్లానింగ్‌లో ప‌డిపోయాడ‌ట‌. లొకేష‌న్లు చూస్త‌న్నార‌ట‌. త్వ‌ర‌లోనే షూటింగ్ పునఃప్రారంభం అవుతుంద‌ని.. సింగిల్ షెడ్యూల్లో మిగ‌తా సినిమాను పూర్తి చేసి ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మీద కూర్చోవాల‌ని శంక‌ర్ చూస్తున్నాడ‌ట‌. గేమ్ చేంజ‌ర్ హిట్ కావ‌డం శంక‌ర్‌కు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇండియ‌న్-2 గురించి బాధ ప‌డుతూ కూర్చోవ‌డానికి ఛాన్స్ లేదు. గేమ్ చేంజ‌ర్‌ను ది బెస్ట్‌గా తీర్చిదిద్ది ప్రేక్ష‌కుల‌కు అందించాలి. మ‌ళ్లీ హిట్టు కొట్టి త‌నేంటో రుజువు చేసుకోవాలి. అప్పుడే కెరీర్ నిల‌బ‌డుతుంది. ఇండియ‌న్-3కి అంతో ఇంతో బ‌జ్ రావాల‌న్నా కూడా గేమ్ చేంజ‌ర్ హిట్ట‌వ‌డం చాలా అవ‌స‌రం కాబ‌ట్టి త‌న ఫోక‌స్ మొత్తాన్ని ఆ చిత్రం మీదికి మ‌ళ్లించాడ‌ట‌శంక‌ర్.

This post was last modified on July 17, 2024 10:02 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

7 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

7 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

7 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

8 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

10 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

11 hours ago