ప్రతి స్టార్ హీరోకూ అభిమానులే బలం. వారి గురించి వేదికల మీద గొప్పగా మాట్లాడుతుంటారు. ఐతే ఫ్యాన్స్‌ను పొగడ్డమే కాక వారి కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తన పెదనాన్న కృష్ణంరాజు చనిపోయినపుడు భీమవరంలో లక్షల మంది అభిమానులకు నాన్ వెజ్ బోజనం పెట్టిన ఘనత ప్రభాస్‌కే చెందుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికీ లేదనుకుండా ఆ రోజు భోజనం పెట్టించడం గురించి పెద్ద చర్చ జరిగింది.
ఇక ఎప్పుడూ ఫ్యాన్స్ గురించి గొప్పగా మాట్లాడే ప్రభాస్.. తాజాగా వాళ్లు లేకుంటే తాను జీరో అని పెద్ద కామెంట్ చేయడం విశేషం. తన కొత్త చిత్రం కల్కి 2898 ఏడీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయి ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశం ఒక నోట్ రిలీజ్ చేశాడు.
అందులో తన అభిమానులకు బిగ్ థ్యాంక్స్ చెబుతూ మీరు లేకుంటే నేను జీరో అన్నాడు ప్రభాస్. అభిమానులను అందరూ కొనియాడేవారే కానీ.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఫ్యాన్స్ లేకుంటే తాను జీరో అని చెప్పడం మాత్రం విశేషం.
ఇక కల్కి మూవీ కోసం ఐదేళ్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంత కష్టపడ్డాడో వివరిస్తూ తనకంటే చిన్నవాడు, సినిమాల్లో జూనియర్ అయిన నాగిని గారు అని సంబోధిస్తూ మాట్లాడాడు ప్రభాస్. ఇంత పెద్ద సినిమాను ఏమాత్రం రాజీ పడకుండా నిర్మించిన వైజయంతీ మూవీస్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పాడు ప్రభాస్. బడ్జెట్, కాస్టింగ్ విషయంలో కొన్నిసార్లు రాజీ పడదాం అని తాము అన్నా నిర్మాతలు వెనుకంజ వేయలేదన్నాడు. చిన్నప్పట్నుంచి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ల సినిమాలు చూసి పెరిగిన తాను వాళ్లతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి అన్నాడు ప్రభాస్. అలాగే గార్జియస్ బ్యూటీ అంటూ కథానాయిక దీపికా పదుకొనే మీద కూడా ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు.
This post was last modified on July 15, 2024 6:07 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…