Movie News

రాజమౌళి బలమే శంకర్ బలహీనత

నిన్న విడుదలైన భారతీయుడు 2కి వచ్చిన టాక్ చూసి పరిశ్రమే కాదు ప్రేక్షక లోకం సైతం ఆశ్చర్యపోయింది. కల్ట్ బ్లాక్ బస్టర్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ ప్యాన్ ఇండియా మూవీకి ఒరిజినల్ వెర్షన్ తమిళంలోనూ ఆశించిన స్పందన రాకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉన్నంతలో ఏపీ తెలంగాణలోనే మెరుగైన వసూళ్లు నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు అందరి వేళ్ళు దర్శకుడు శంకర్ వైపు వెళ్తున్నాయి. ఐ నుంచి ఇండియన్ 2 దాకా ఆయన ముద్ర కనిపించడం లేదని, ఒకప్పటి వెటరన్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదని అంటున్నాయి.

ఇక్కడ రాజమౌళి ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందో చూద్దాం. జక్కన్న ప్రాధమికంగా కథకుడు కాదు. స్టోరీలు రాయడు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సబ్జెక్టుని తీసుకుని తన టీమ్ తో ఒక వెర్షన్ ని తయారు చేయించి దాన్ని తెరమీదకు ఎలా ఎక్కిస్తే ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారో అలాంటి బ్లాక్స్, ఎమోషన్స్ డిజైన్ చేసుకుంటారు. శంకర్ కు ఒకప్పుడు సుజాత (మునుపటి పేరు ఎస్ రంగరాజన్) ఉండేవారు. రోబో షూటింగ్ సమయంలో ఆయన చనిపోయాక ఒక్కసారిగా శంకర్ బృందంలో కుదుపు వచ్చేసింది. తండ్రి లాంటి ఆయన కలం లేని లోటు ఎవరూ తీర్చలేకపోయారు.

ఇక అక్కడ నుంచి శంకర్ మార్క్ మిస్ అవ్వడం మొదలైంది. జెంటిల్ మెన్ నుంచి ఈ ఇద్దరి ప్రయాణం అమోఘంగా సాగింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లను నభూతో అనిపించేలా డిజైన్ చేయడంలో సుజాతది అందెవేసిన చెయ్యి. వందకు పైగా నవలలు రాసిన అనుభవం, ఇంజనీరింగ్ తో సహా వివిధ వృత్తుల్లో రాటుదేలిన వైనం ఆయన్ని మాస్టర్ రైటర్ గా మార్చాయి. సుజాత కాలం చేశాక శంకర్ మళ్ళీ మరో రీ ప్లేస్ మెంట్ చేసుకోలేకపోయారు. రాజమౌళి బలం విజయేంద్ర గారైతే శంకర్ కు అలాంటి ఆయుధంగా ఉన్న సుజాత రంగరాజన్ లేకపోవడం ముమ్మాటికీ తీరని నష్టం.

This post was last modified on July 13, 2024 11:25 am

Share

Recent Posts

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

39 minutes ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

55 minutes ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

2 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

2 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

3 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

4 hours ago