ఇండియన్ సినిమాకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిలింఫేర్ ఒకటి. కొంత ఆలస్యంగా అయినా సరే విజేతల ఎంపికలో ఈ సంస్థ పాటించే ప్రామాణికాలు ప్రేక్షకుల్లో మంచి నమ్మకాన్ని కలిగించాయి. ఒకప్పటిలా విపరీతమైన క్రేజ్ లేకపోయినప్పటికీ మూవీ లవర్స్ లో ఫిలిం ఫేర్ మీద గౌరవం ఉంది. ఈసారి 2023 విన్నర్స్ లిస్టు ఆసక్తికరంగా ఉంది. ఆర్ఆర్ఆర్ ఉత్తమ సినిమాగా గెలుపుతో పాటు దర్శకుడిగా రాజమౌళి, హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్, సంగీత దర్శకుడిగా కీరవాణి, కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ కు పురస్కారాలు తెచ్చింది.
క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కించుకున్న మూవీగా సీతా రామం నిలిచింది. దర్శకుడిగా హను రాఘవపూడికి గౌరవం దక్కింది. ఇదే విమర్శకుల విభాగంలోనే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సీతారామశాస్త్రి (గీత రచయిత), చిన్మయి శ్రీపాద (గాయని) కి అవార్డులు దక్కాయి. విరాట పర్వంలో పెర్ఫార్మన్స్ కు గాను సాయిపల్లవి మరోసారి ఫిలిం ఫేర్ అందుకోనుంది. ఇదే సినిమాలో సపోర్టింగ్ రోల్ కోసం నందితా దాస్ కు గుర్తింపు దక్కింది. ఇదే క్యాటగిరీలో భీమ్లా నాయక్ నటనకు రానా దగ్గుబాటికి అవార్డు వచ్చింది. ట్రిపులార్ లో కొమురం భీమూడో పాడిన కాలభైరవ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అయ్యాడు.
వీటితో పాటు తమిళ, కన్నడ, మలయాళం సినిమాలకు సంబంధించి ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న వాటిలో కోలీవుడ్ నుంచి పొన్నియిన్ సెల్వన్ 1, మణిరత్నం, కమల్ హాసన్, ధనుష్, మాధవన్, సాయిపల్లవి, ఏఆర్ రెహమాన్, సంతోష్ నారాయణన్, ప్రదీప్ రంగనాధన్, కెకె సెంథిల్ కుమార్ తదితర పేర్లున్నాయి. శాండల్ వుడ్ బెస్ట్ మూవీగా కాంతార ఎంపికవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరికొందరు అర్హత కలిగిన వాళ్లకు అవార్డు రాలేదనే అసంతృప్తి కొందరు అభిమానుల్లో ఉన్నప్పటికీ నామినేషన్లలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల వడపోత తప్పలేదు. ఈవెంట్ త్వరలోనే జరుగనుంది.
This post was last modified on July 12, 2024 6:58 am
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…